CWG 2022 : బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022 గురువారం ఆరంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 20 క్రీడాంశాల్లో పతకాలు సాధించేందుకు 72 దేశాలకు చెందిన అథ్లెట్లు సై అంటున్నారు.
ఇక భారత్ నుంచి 205 మంది ప్లేయర్స్ 16 క్రీడాంశాల్లో బరిలో ఉన్నారు. అయితే స్క్వాష్ (Squash) క్రీడలో పతకం తెచ్చేందుకు 14 ఏళ్ల చిచ్చర పిడుగు భారత్ తరఫున సై అంటుంది.
మహిళల విభాగంలో అనహత్ సింగ్ (Anahar Singh) పోటీ పడనుంది. ఆమె వయసు కేవలం 14 ఏళ్లే కాగా.. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది.
న్యూఢిల్లీకి చెందిన అనహత్ సింగ్ భారత్ తరఫున కామన్వెల్త్ గేమ్స్ లో బరిలోకి దిగిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఈమె వెటరన్ ప్లేయర్స్ జ్యోత్స చిన్నప్పతో కలిసి స్క్వాష్ బరిలో ఉంది.
ఇప్పటి వరకు అనహత్ 46 జాతీయ టైటిల్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో రెండు జాతీయ చాంపియన్ షిప్ టైటిల్స్ ను కూడా అందుకుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో 8 టైటిల్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం 6 ఏళ్ల తన కెరీర్ లో సాధించడం విశేషం.
అనహత్ సింగ్ తన 8వ ఏట స్క్వాష్ ను కెరీర్ గా ఎంచుకుంది. ఇక జూనియర్ స్థాయిలో బ్రిటీష్ స్క్వాష్ చాంపియన్ షిప్ ను, యూఎస్ స్క్వాష్ టైటిల్స్ ను సొంతం చేసుకున్న తొలి భారతీయురాలిగా కూడా అనహత్ నిలువడం విశేషం. ఇక ట్రయిల్స్ లో అదరగొట్టడంతో అనహత్ ను బర్మింగ్ హామ్ కు పంపేందుకు భారత్ సిద్ధమైంది.
అంగరంగ వైభవంగా
గురువారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో వేడుకల్లో పీవీ సింధు (PV Sindhu), పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఫ్లాగ్ బేరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరు జాతీయ పతకాన్ని పట్టుకుని భారతీయ బృందాన్ని ముందుకు నడిపించారు.
సింధు ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించింది. 2016 రియోలో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.
మరోవైపు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా క్రీడలకు దూరమయ్యాడు. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. మహిళల క్రికెట్‌ను తొలిసారిగా క్రీడల్లో చేర్చారు.
0 Comments:
Post a Comment