ఇండియాలో క్రెడిట్ కార్డ్ (Credit Card)లను వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసిన డేటా ప్రకారం..
దేశంలో క్రెడిట్ కార్డ్ ఖర్చు సంవత్సరానికి ఆల్ టైమ్ హైని తాకింది. ట్రాన్సాక్షన్ (Transcation)లు కూడా పెరగడంతో వినియోగదారులు, ముఖ్యంగా మొదటి సారి కార్డ్‌లు వినియోగిస్తున్న యువత.. ఈ ఫైనాన్షియల్ ప్రాడక్ట్‌లను వినియోగించడంలో అదనపు జాగ్రత్తలు పాటించాలని ఆర్బీఐ చెబుతోంది. క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు సెక్యూరిటీ, సేఫ్టీ టిప్స్ సూచించింది. అవేంటంటే..
* పాస్వర్డ్ కాపాడుకోండి
కార్డ్ పాస్‌వర్డ్‌ను తెలియని వ్యక్తులకు ఇవ్వకూడదు. ఆన్లైన్ లాగిన్ వివరాలు, పాస్వర్డ్లు, కార్డ్, CVV నంబర్ల వంటి సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. ఈ డేటా ఇతరులకు తెలిస్తే దుర్వినియోగం కావచ్చు. ఆర్థిక వివరాలను ఇన్పుట్ చేయడానికి పబ్లిక్ కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లను ఉపయోగించడం మానుకోండి. మరింత భద్రత కోసం, ప్రతి మూడు లేదా ఆరు నెలలకు క్రెడిట్ కార్డ్ పిన్ , ఆన్లైన్ లాగిన్ పాస్‌వర్డ్‌ను మారిస్తే మంచిది.
* క్రెడిట్ కార్డ్‌లు షేర్ చేసుకోకూడదు
క్రెడిట్ కార్డ్ బ్యాంక్ పాస్వర్డ్ లాంటిది. కార్డ్‌ను బంధువులు లేదా స్నేహితులకు ఇవ్వకూడదు. క్రెడిట్ కార్డును తెలియని వ్యక్తికి ఇవ్వడం వల్ల ఫైనాన్షియల్ హెల్త్ ప్రమాదంలో పడవచ్చు. భారతదేశంలో, PIN అథెంటికేషన్ వంటి వాటితో కార్డ్‌లు అత్యంత సురక్షితమైనవి. ప్రతి దేశానికి దాని సొంత తనిఖీలు ఉన్నాయి. దుకాణాలు, రెస్టారెంట్లలో కార్డ్ స్వైడ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
* క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, క్రెడిట్ స్కోర్
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే ఇది అనధికార ట్రాన్సాక్షన్లను గుర్తించడంలో సహాయపడుతుంది. అలాంటివి గుర్తిస్తే వెంటనే కార్డ్ కంపెనీకి తెలియజేసి, చర్యలు తీసుకోవచ్చు. అదే విధంగా క్రెడిట్ స్కోర్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. కొన్నిసార్లు, తమ పేర్లపై అనధికారిక లేదా మోసపూరిత క్రెడిట్ లైన్లు ఉన్నాయని, చెల్లించని అప్పులు ఉన్నాయని, వారి క్రెడిట్ స్కోర్‌ను నాశనం చేస్తున్నాయని ప్రజలకు తెలియదు.
* డైలీ క్రెడిట్ లిమిట్
చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ యాప్ లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా క్రెడిట్ కార్డ్‌పై ట్రాన్సాక్షన్ లిమిట్‌ని సెట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తాయి. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ లావాదేవీలను నియంత్రించడం, గరిష్ట రోజువారీ వ్యయ పరిమితిని సెట్ చేయడం, కార్డ్‌పై వ్యయ పరిమితిని తగ్గించడం, కార్డ్ లావాదేవీలను ఆఫ్ చేయడం లేదా ఆన్ చేయడం మొదలైనవాటిలో సహాయపడుతుంది.
* క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేయాలి
అన్ని జాగ్రత్తలు,భద్రతా చర్యలు ఉన్నప్పటికీ, కార్డ్ డేటా రాజీ పడినా లేదా మోసపూరిత ట్రాన్సాక్షన్ జరిగినా, వెంటనే కార్డ్ బ్లాక్ చేయాలి. సంబంధిత కంపెనీని సంప్రదించి చర్యలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్ మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేయవచ్చు. అనుమానాస్పద వెబ్సైట్లలో క్రెడిట్ కార్డ్ ఉపయోగించకూడదు. ఇ-మెయిల్ లేదా టెక్స్ట్ ద్వారా వచ్చిన తెలియని లింక్‌పై క్లిక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. బ్యాంక్ అధికారిగా నటించే వారి నుంచి లేదా కార్డ్ కంపెనీ కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా కాల్ చేసినా, కార్డ్ వివరాలను షేర్ చేయకూడదు.
* క్రెడిట్ కార్డ్‌లను టోకెనైజ్ చేయండి
టోకెనైజేషన్ అనేది డేటా థెఫ్ట్ వంటి మోసం నుంచి క్రెడిట్ కార్డ్‌ను రక్షించడంలో సహాయపడే ప్రత్యేకమైన కోడ్‌తో కార్డ్ సమాచారాన్ని భర్తీ చేసే ప్రక్రియ. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు, టోకెనైజేషన్ కార్డ్ సమాచారాన్ని మాస్క్ చేస్తుంది. కార్డ్ నంబర్ వంటి సమాచారం వ్యాపారి వద్ద సేవ్ కావు. ఆర్బీఐ ఇటీవలే కార్డ్ టోకనైజేషన్ గడువును సెప్టెంబర్ 30, 2022 వరకు పొడిగించింది.
0 Comments:
Post a Comment