మనం నీటిని తాగకుండా.. ఆహారాన్ని భుజించకుండా ఎక్కువ రోజులు ఉండలేము..అయితే కొంతమంది మాత్రం రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎక్కువగా చాలామందికి పాలు తాగే అలవాటు ఉంటుంది అయితే చికెన్ లేదా మాంసం తిన్న తర్వాత పాలు తాగుకూడదని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా పాలు , ఉప్పు కలిపిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరంగా మారుతుందని కొన్ని పురాణాలలో తెలపడం జరిగిందట.
అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులను కూడా వచ్చే అవకాశం ఉంటుందట. చికెన్ తిన్న తర్వాత పాలు వంటివి తాగడం వల్ల జీర్ణం కాకుండా ఉంటుందట.
అంతేకాకుండా మాంసం పాలు రెండు కూడా విరుద్ధమైన పదార్థాలు. అయితే మాంసము , పాలు ఒకేసారి తాగడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలు, మాంసాన్ని కలిపి తినడం వల్ల విష ప్రభావం తయారవుతుంది. దీని వల్ల ఉదర సంబంధిత సమస్యలే కాకుండా చర్మ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
మాంసాహారం , పాలు శరీరానికి ఆరోగ్యకరమని చెబుతూ ఉంటారు కానీ వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం.
చికెన్ లో పెరుగు తినడం మంచిది కాదని కూడా కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.
ఇలా ఆహారం తీసుకుంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు రావడమే కాకుండా రాబోయే రోజులలో ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అందుచేతనే ఎక్కువగా చికెన్ తిన్న తర్వాత ఎక్కువగా పెరుగు ను తినక పోవడమే మంచిదని చెప్పవచ్చు..
మాంసాహారాలలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు , విటమిన్లు ఉండడం వల్ల పాలలో అన్ని పోషకాలు ఎక్కువగానే ఉంటాయి కనుక ఇవి రెండు విరుద్ధంగా మారుతాయి.
అందుచేతన చికెన్ తిన్న తర్వాత పాలను తాగకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. కానీ ఏదైనా తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు.
0 Comments:
Post a Comment