🔳బైజూస్ మాయ!
ఉచితం.. ఉత్తమమంటూ జగనన్న ఆర్భాటం
ప్రైవేటు ట్యూషన్ల పేరిట దోచిపెట్టే ఎత్తుగడట్యూషన్ ఉచితమే.. ప్రీలోడెడ్ ట్యాబ్‌లే ఖరీదు
8 చదివే పిల్లల కోసం రూ.500 కోట్ల ట్యాబ్‌లు
రానురాను రూ.వెయ్యి కోట్లు దాటే అవకాశం
4 లక్షల మంది డేటా కార్పొరేట్ సంస్థ చేతికి
ట్యాబ్‌ల కంపెనీలతోనూ ‘లాభదాయక’ డీల్పరోక్షంగా బైజూ్‌సకు భారీ ప్రయోజనాలు విద్యార్థులకు లాభం కంటే కంపెనీకే మేలెక్కువ
బైజూస్ చెప్పేవి కార్పొరేట్ ట్యూషన్లుఅదే పని సర్కారీ టీచర్లతోనూ చేయవచ్చు
ఐటీ శాఖ సేవలను ఉపయోగించుకోవచ్చు
ఖర్చు లేకుండా మంచి ఫలితాలు రాబట్టే వీలుఅయినా బైజూస్ వెంట పరుగు
ఏది ఉచితం?: బైజూస్ చెప్పే ప్రైవేటు ట్యూషన్లు వినాలంటే ట్యాబ్ ఉండాలి. తన సాప్ట్‌వేర్‌ను ప్రీలోడెడ్‌గా ఇచ్చే ట్యాబ్‌లనే ఆ సంస్థ సిఫారసు చేస్తుంది కాబట్టి వాటినే ప్రభుత్వం కొనితీరాలి. ఒక్కో ట్యాబ్ కనిష్ఠం రూ.15 వేలు అనుకున్నా రూ.705 కోట్లు దాకా తయారీ సంస్థకు లాభం. రూ. 500 కోట్లకే కొనుగోలు చేస్తామని సర్కారు చెబుతోంది. అలా చూసినా.. ట్యాబ్ తయారీ సంస్థకు, బైజూ్‌సకు మధ్య ‘లాభదాయక’ డీల్ కుదిరినట్టే!
ఏది ఉత్తమం?: ప్రైవేటు ట్యూషన్లు చెప్పే బైజూస్ సంస్థ విద్యార్ధుల డేటాను పరిశీలిస్తుంది. డేటా కొనుగోలుకు ఈ రోజుల్లో కంపెనీలు రూ. కోట్లు వెచ్చిస్తున్నాయి. అలాంటిది ఉచిత సేవ పేరిట ఏకంగా నాలుగు లక్షల మంది విద్యార్థుల డేటా బైజూ్‌సకు గంపగుత్తగా వెళుతుంది. ఈ డేటాతో బైజూస్ ఏం చేస్తుంది...ఎలా వినియోగించుకుంటుందనేది అంతా గోప్యమే!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)ఈఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడ్డగోలు కార్యక్రమానికి సిద్ధమైంది. పరోక్ష పద్ధతిలో ఓ సంస్థకు అయాచిత ఆర్థిక లబ్ధిని, మార్కెట్లో తన విలువను పెంచుకునే అవకాశాన్ని కల్పించబోతుంది. ఉచితం...ఉత్తమం పేరిట చేతికింద ఉన్న సర్కారీ టీచర్ల వ్యవస్థను కాదని ప్రైవేటు ట్యూషన్లు చెప్పే బైజూస్ అనే ఓ కార్పొరేట్ సంస్థ వెంటపడుతోంది. ఆ సంస్థ సేవలను మెచ్చి...ఏపీ పేద విద్యార్థులకు సేవలందించాలని కోరింది. ఇక ఆ సంస్థ ముందుకొచ్చిందని, ఏపీ విద్యార్థులను ఎక్కడికో తీసుకెళ్తామని స్వయంగా సర్కారు ప్రకటించింది. మేడిపండుచందంగా ఉన్న ఈ ఉత్తమ సేవ ముసుగుతీస్తే ఎన్నో పురుగులు కనిపిస్తున్నాయి. ఉచితంగా అందించే బైజూస్ సేవలకోసం దాని అప్లికేషన్‌ను సపోర్ట్‌చేసే ట్యాబ్‌లు కొనబోతున్నారు. వీటి ఖరీదు ఈ ఏడాదికి రూ.500 కోట్లమేర ఉండనుంది. ఆ తర్వాత ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరగడంతో కొనుగోలు చేసే ట్యాబ్‌ల సంఖ్య, దాని బడ్జెట్ రెండింతలు, ఇంకా పెంచుకునేదానిబట్టి పెరగబోతుంది. అంటే ఉచితం పేరిట రాష్ట్ర ఖజానాకు భారీ చిల్లు పెట్టబోతున్నారు. సారు...ఉచితం...ఉత్తమం అన్నారంటే అందులో సర్కారు సొమ్మును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గంపగుత్తగా ధారాదత్తం చేసే స్కీమ్‌ను తెరపైకి తెచ్చారని ఇప్పుడు మరోసారి స్పష్టమవుతోంది. దీన్ని లోతుగా పరిశీలిస్తే తప్ప జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోని అసలు గుట్టు బయటకు రాదు. అది తెలియాలంటే అసలు బైజూస్ ఏమిటి? దాన్నే ఎందుకు తీసుకొస్తున్నారు? ఒప్పందం వల్ల జరిగే మేలు ఎవరికి? ఉచితం వెనుక ఉన్న చీకటి కోణాలు ఏమిటనేది ‘ఆంధ్రజ్యోతి’ మీ ముందుకు తీసుకొస్తోంది.
ఎక్కడిదీ బైజూస్?బైజూ రవీంద్రన్ అనే వ్యక్తి 2011లో ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు లిమిటె డ్ కంపెనీ’ని స్థాపించారు. ఆన్లైన్ ట్యూషన్, ప్రత్యేక క్లాసుల కాన్సె్‌ప్టతో ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. 2015లో ‘బైజూస్ లెర్నింగ్’ యాప్‌ను ఆవిష్కరించారు. సీబీఎ్‌సఈ, స్టేట్ సిలబ్‌సల పరిధిలో ఆరు నుంచి ఇంటరు రెండో సంవత్సరం వరకు లెర్నింగ్ పేరిట ఆన్లైన్ ట్యూషన్లు బైజూస్ చెబుతోంది. ఇప్పటికే అమల్లో ఉన్న సిలబ్‌సల ఆధారంగా గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్లు, వాటి మేళవింపుతో రూపొందించిన మోడల్ పేపర్లతో విద్యార్ధులకు ఆన్లైన్ ట్యూషన్స్ ద్వారా కంటెంట్ అందిస్తోంది. అంతేతప్ప ప్రత్యేకంగా సిలబ్‌సలను తయారు చేసి బోధించడం లేదు. స్టార్టప్ కంపెనీలను ఒకదానివెంట ఒకటిగా విలీనం చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా 22 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ చదివే విద్యార్థుల డేటాను బైజూస్ ముందుగానే సేకరించుకుంటుంది. ఆ డేటాతో నేరుగా విద్యార్ధులకు లేక తల్లిదండ్రులకు ఫోన్ చేస్తోంది. ‘‘మీ విద్యార్ధి సబ్జెక్టుల్లో బాగా వీక్‌గా ఉన్నారు. అలాగే వదిలేస్తే అతనికి ఉజ్వల భవిష్యత్ ఉండదు. మేం బైజూస్ అనే ప్రత్యేక లెర్నింగ్ యాప్‌ను తయారుచేశాం.
వీక్‌గా ఉన్న సబ్జెక్టుల్లో ప్రత్యేక ట్యూషన్లు చెబుతాం. డెమో క్లాసులు వినండి. నచ్చితేనే రెగ్యులర్ క్లాసుల్లో చేరండి. ఒకవేళ ఫీజు చెల్లించిన తర్వాత మీకు కంటెంట్ నచ్చకపోతే ఎప్పుడయినా చందాను రద్దుచేసుకోవచ్చు’’ అని చెబుతారు. పిల్లల భవిష్యత్తు అనగానే తల్లిదండ్రులకు ఎక్కడా లేని ఆనందం. అప్పుతెచ్చయినా ఫీజులు చెల్లించి చదివించాలనుకుంటారు. ఫీజులు రూ.20 వేల నుంచి రూ.60వేలపైనే ఉంటాయి. 1, 2వ తరగతుల వారికి డిస్నీ బైజూస్ పేరిట నెలకు రూ. 3,333 ఫీజు వసూలు చేస్తారు. గణితం, సైన్స్లకు సంబంధించిన ట్యూషన్ ఫీజులకు 4-9వ తరగతుల వారికి సగటున 26వేల రూపాయల ఫీజు వసూలు చేస్తారు. పూర్తిస్థాయిలో సమగ్ర కోర్సులకు ఒక్కో తరగతికి 35వేలు వసూలు చేస్తారు. ఇంటర్ కోర్సులకు సంబంధించి లైవ్ తరగతులకు(నీట్) ఒక్కో విద్యార్ధి నుంచి లక్ష రూపాయల ఫీజు వసూలు చేస్తారు.
కరోనాకు ముందు...తర్వాత...2020లో వచ్చిన కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులకు భారీ డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ వల్ల ఆఫ్‌లైన్ క్లాసులు నిలిచిపోయాయి. ఫలితంగా ఎల్కేజీ నుంచి పీజీల వరకు ఆన్లైన్ క్లాసులను ఆశ్రయించారు. ఈ పరిస్థితి బైజూ్‌సకు బాగా కలిసొచ్చింది. లక్షలాది మంది ఆన్లైన్ క్లాసులతోపాటు ట్యూషన్లకు వార్షిక చందాలు తీసుకున్నారు. 2021వరకు ఇది అప్రతిహతంగా కొనసాగింది.
అయితే,ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గి విద్యాసంస్థలు పనిచేయడం ప్రారంభించాక ఆన్లైన్ ట్యూషన్లు, క్లాసులు తగ్గిపోయాయి. కొత్తగా వార్షిక చందాలు తీసుకున్న వారి సంఖ్య 35 శాతానికి పడిపోయింది. సహజంగానే సంస్థ రాబడి తగ్గిపోయింది. లాభాల మాట అటుంచితే తీవ్ర ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొనే స్థితికి వచ్చిందని మార్కెట్వర్గాల భోగట్టా. ఈ కారణంగానే ఆకాశ్ సర్వీ్‌సను విలీనం చేసుకునే డీల్‌లో చెల్లింపులు బాగా ఆలస్యం అయ్యాయి. చివరకు ఆరువేల కోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది బైజూస్. ఇదే క్రమంలో ఉచితం...ఉత్తమం పేరిట బైజూ్‌సను పిలిచి జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పేలా బైజూ్‌సను ఒప్పించి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించింది. దీనివల్ల పేద విద్యార్ధులకు కలిగే ప్రయోజనం కన్నా బైజూ్‌సకు జరిగే మేలు ఎక్కువ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ’’ప్రస్తుతం బైజూస్ నిధుల వేటలో ఉంది.
ఆ సంస్థను నమ్మి ఉదారంగా నిధులు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో ఏపీ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆ సంస్థకు మేలు చేస్తుంది. ఈ ఒప్పందం వల్ల ఓ రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఆ సంస్థకు దొరికినట్లవుతుంది. దాన్ని చూసి నిధులు ఇచ్చేందుకు పెట్టుబడిదారులు, కంపెనీలు ముందుకొస్తాయి. మార్కెట్లో ఆ సంస్థ విశ్వసనీయత మరింత పెరుగుతుంది. ఏపీ తరహాలోనే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా ప్రైవే టు విద్యాసంస్థలు ఒప్పందాలు చేసుకునే మార్గం ఏర్పడింది. కాబట్టి ఈ ఒప్పందం వల్ల ప్రత్యక్షంగా ప్రభుత్వంపై రూపాయి భారం పడకపోవచ్చు. కానీ బైజూ్‌సకు మాత్రం మార్కెట్లో బలంగా ప్రదర్శించుకునేంతటి బలం దొరికినట్లవుతుంది. ఇది మేలుకాదంటారా?’’ అని మార్కెట్ నిపుణులు కృష్ణారావు పేర్కొన్నారు.
ఏటా కొనుగోళ్లు...రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్ధులు, సీబీఎ్‌సఈలో 10వ తరగతి చదువుతున్న 4.7 లక్షల మందికి ఉచితంగా బైజూస్ నుంచి కంటెంట్ తీసుకోవాలంటే ఆ సంఖ్యలో ట్యాబ్‌లు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం లెనెవో కె12 లేదా కె.10 సీరిస్ టాబ్‌ల్లో ఈ సాప్ట్వేర్ ప్రీలోడెడ్‌గా ఇస్తున్నారు. ట్యాబ్‌లు ఏ కంపెనీవి కొనుగోలు చేస్తారు? అంటే ఖచ్చితంగా బైజూస్ సిఫారసు చేసే వాటినే కొనుగోలు చేస్తారు. దీని వల్ల ట్యాబ్ తయారీ సంస్థకు, బైజూ్‌సకు మధ్య ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. ఈ ఏడాది 8వ తరగతికి ట్యాబ్‌లు అంటున్నారు. వచ్చేఏడాది కొత్తగా 8లో చేరేవారికి, పదో తరగతి వారికి కూడా ఇస్తామంటారు. అప్పుడు విద్యార్ధుల సంఖ్య ఎంతలేదన్నా కనీసం 10 లక్షలపైనే ఉంటుంది. ఇంత సంఖ్యలో ట్యాబ్‌లు కొనుగోలు చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుందో ఊహించండి? కనీసం రూ.1500 కోట్లపైనే ఉంటుంది.
అదే పని ఖర్చులేకుండానే చేయవచ్చు..రాష్ట్రంలో విద్యాబోధనకు వేలాదిమంది టీచర్లు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నారు. ప్రభుత్వానికి సొంతంగా పాఠశాలలు, మౌలిక సదుపాయాలున్నాయి. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులున్నారు. అన్నింటికి మించి ఐటీ డిపార్ట్మెంట్ ఉంది. నిజంగా విద్యార్ధులకు ఆన్లైన్ ట్యూషన్లు చెప్పించాలనుకుంటే ప్రభుత్వ టీచర్లనే ఆ పనికి ఉపయోగించుకోవచ్చు. పాఠశాలల్లోనే ఆ పనిని చేపట్టవచ్చు. ఐటీ శాఖను పిలిచి ఆన్లైన్ ట్యూషన్లకు ఓ ప్రత్యేక యాప్‌ను తయారు చేయమని ఆదేశించవచ్చు. ఇందుకు అవసరమైన సాంకేతిక సమర్ధత ఐటీ శాఖకు ఉంది. ప్రభుత్వ టీచర్లను మించిన బోధనాసామర్ధ్యం ప్రైవేటులో వారికి ఉంటుందా? ఎన్నో కఠినపరీక్షలు దాటుకొని ప్రభుత్వ టీచర్‌గా కొలువుల్లో చేరినవారు సర్కారు ఆదేశిస్తే పేద విద్యార్ధులకు ఐటీ ఆధారిత ఆన్లైన్ ట్యూషన్లు చెప్పడం పెద్ద కష్టమైన పనికాదు. కానీ సర్కారు ఆ ఆలోచనే చేయడం లేదు. ఎందుకంటే సర్కారుకు వారితో గొడవలున్నాయి. వేతన సవరణల విషయంలో ప్రభుత్వానికి టీచర్ల మధ్య తీవ్ర అగాధం నెలకొంది. అయినా టీచర్లు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ పాఠాలు చెబుతూనే ఉన్నారు. కానీ వారిని విశ్వాసంలోకి ప్రభుత్వం తీసుకోవడం లేదు.
కంపెనీ చేతికి డేటా బైజూస్ క్లాసులు వినాలంటే ఓ ట్యాబ్ ఉండాలి. ఇందులో ప్రీలోడెడ్‌గా బైజూస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్నవారికే ఆ ట్యాబ్ ఇస్తారు. బైజూస్ సాఫ్ట్వేర్ ఫోన్, ట్యాబ్‌ల్లోనే పనిచేస్తుంది. ల్యాప్‌టా్‌పలో పనిచేయదు. ఎందుకంటే ల్యాప్‌టాప్ అల్గారిధమ్స్ వేరు. ఇక ఈ ట్యాబ్ పనిచేయాలంటే విధిగా ఇంటర్నెట్ ఉండాలి.
లేదంటే కంటెంట్ ముందుగానే లోడ్‌చేసిన ఎస్డీ (మెమరీ)కార్డును కొనుగోలు చేయాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే...ట్యాబ్‌ను వినియోగించేది విద్యార్ధి. కానీ అందులోని అంశాలపై నియంత్రణ బైజూ్సదే. ట్యాబ్లేదా ఫోన్లోని కెమెరా, మైక్, కాంటాక్ట్ లిస్టు, వెబ్‌లో సెర్చ్ హి స్టరీ, ట్యాబ్‌లో విద్యార్ధి ఉపయోగించే డేటా, విద్యార్ధి పూర్తి వివరాలు, చందా చెల్లింపులకోసం ఉపయోగించే క్రెడిట్‌కార్డు వివరాలు, ఇంకా ట్యాబ్‌లో సమస్యలు వస్తే జరిగే ట్రబుల్షూట్ లాగ్ డేటా వంటివి పరిశీలిస్తుంది. ఈ డేటాను బైజూ్సతోపాటు తన మాతృసంస్థ అయిన ఽ‘దింక్ అండ్ లెర్న్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ’ పరిశీలిస్తుంది. కంటెంట్ తయారీ, సమస్యల పరిష్కారాల (ట్రబుల్షూట్) సందర్భంగా ఈ డేటాను ఽథర్డ్‌పార్టీ (వాటితో ఒప్పందం చేసుకున్న ఇతర కంపెనీ) కూడా ఈ డేటాను వినియోగిస్తాయని ఆ సంస్థ తన ప్రైవసీ (గోప్యతా విధానం) పాలసీలో పేర్కొంది. పేద విద్యార్ధులకు ఉత్తమ విద్య, కంటెంట్ పేరిట బైజూ్సపై సర్కారు గొప్ప విశ్వాసాన్ని పెట్టుకుంది. పేదల ఆశలను తీరుస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి నిజంగా బైజూ్‌సకు ఆ సామర్ధ్యం ఉందా? అంటే ఇప్పటి వరకు అది నిరూపితమే కాలేదు.
బ్యాక్‌డోర్ బెనిఫిట్స్...బైజూ్‌సకు మరో ప్రయోజనం కూడా ఉంది. ఎలాగూ 8వ తరగతి వారికి ప్రభుత్వం ఉచితంగా కంటెంట్ ఇప్పిస్తోంది కదా...9,10 తరగతుల వారు కూడా తమ కంటెంట్ తీసుకోమ్మని డోర్‌టు డోర్ ప్రచారం చేయకుండా ఉండగలదా... ఈ పేరిట ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్లు తీసుకోకుండా ఉంటుందా...అన్న అనుమానాలు లేకపోలేదు. కేవలం కంటెంట్ మాత్రమే ఇచ్చి, మాక్ పరీక్షలకు అనుమతి ఇవ్వను అంటే ఏమిటి పరిస్థితి? ట్యూషన్ అయ్యాక మాస్టారు పెట్టే పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయన్నదే ప్రతీ తండ్రి ప్రామాణికంగా తీసుకుంటారు. మరి మాక్ పరీక్షలు, ఇతర ప్రీమియం సర్వీసుకు విద్యార్ధులు ఫీజు చెల్లించాలని షరతు పెడి తే? నిజానికి ఈ పేరుచెప్పి, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్ధుల నుంచి సబ్‌స్ర్కిప్షన్లు తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే సర్కారుకు ఇచ్చే ఉచిత కంటెంట్‌ను ఎరగాచూపి...ప్రైవేటు విద్యాసంస్థల నుంచి భారీగా కొత్త సబ్‌స్ర్కిప్షన్లు తీసుకునే అవకాశాలున్నాయి. ఇలాంటి మార్కెటింగ్ విధానాలు ఆ సంస్థ దగ్గర ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి ఉచితంగా కంటెంట్ వల్ల లబ్దిపొందేది ఎవరు? లాభపడేది ఎవరు?
ఫేస్బుక్ బంధం కోసమేనా? ఫేస్బుక్ యజమాని మార్క్ జుకెర్‌బర్గ్ దంపతులు సంయుక్తంగా ‘జుకెర్‌బర్గ్ ఇన్షియేటివ్’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ పేరిట 2016లో బైజూ్‌సలో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. చైనా వీడియోగేమింగ్ కంపెనీ టెన్సెంట్ హోల్డింగ్స్ 2017లో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇలా అంతర్జాతీయంగా దాదాపు ఆరు కంపెనీల పెట్టుబడులు బైజూ్‌సలో ఉన్నాయి. వీటిల్లో ఫేస్బుక్ పెట్టుబడులే ఆసక్తికరంగా మారాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ సర్కారు తన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కోసం వాట్సప్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ ఇప్పుడు ఫేస్బుక్ సంస్థ అయిన మెటాలో భాగస్వామి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ప్రచారాలకోసం చాట్బోట్లను వాట్సాప్ కేటాయించదు. ఇది వాట్పా్సపాలసీ. ఈ రూల్స్ ప్రకారం వైసీపీకి చాట్‌బోట్ ఇవ్వరు. అందుకే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పేరిట చాట్‌బోట్ వినియోగానికి అనుమతి తీసుకొని ఒప్పందం చేసుకున్నారు. దాన్ని పరోక్షంగా రాజకీయంగాను వాడుకుంటారన్న విమర్శలు ఎలాగూ ఉన్నాయి. ఈ పరిణామం చోటుచేసుకున్న కొద్దిరోజులకే... ఫేస్బుక్ వ్యవస్ధాపకుల పెట్టుబడులున్న కార్పొరేట్ ట్యూషన్ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బైజూస్ మాయ!కంపెనీ చేతికి డేటా బైజూస్ క్లాసులు వినాలంటే ఓ ట్యాబ్ ఉండాలి. ఇందులో ప్రీలోడెడ్‌గా బైజూస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్నవారికే ఆ ట్యాబ్ ఇస్తారు. బైజూస్ సాఫ్ట్వేర్ ఫోన్, ట్యాబ్‌ల్లోనే పనిచేస్తుంది. ల్యాప్‌టా్‌పలో పనిచేయదు. ఎందుకంటే ల్యాప్‌టాప్ అల్గారిధమ్స్ వేరు. ఇక ఈ ట్యాబ్ పనిచేయాలంటే విధిగా ఇంటర్నెట్ ఉండాలి.
లేదంటే కంటెంట్ ముందుగానే లోడ్‌చేసిన ఎస్డీ (మెమరీ)కార్డును కొనుగోలు చేయాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే...ట్యాబ్‌ను వినియోగించేది విద్యార్ధి. కానీ అందులోని అంశాలపై నియంత్రణ బైజూ్సదే. ట్యాబ్లేదా ఫోన్లోని కెమెరా, మైక్, కాంటాక్ట్ లిస్టు, వెబ్‌లో సెర్చ్ హి స్టరీ, ట్యాబ్‌లో విద్యార్ధి ఉపయోగించే డేటా, విద్యార్ధి పూర్తి వివరాలు, చందా చెల్లింపులకోసం ఉపయోగించే క్రెడిట్‌కార్డు వివరాలు, ఇంకా ట్యాబ్‌లో సమస్యలు వస్తే జరిగే ట్రబుల్షూట్ లాగ్ డేటా వంటివి పరిశీలిస్తుంది. ఈ డేటాను బైజూ్సతోపాటు తన మాతృసంస్థ అయిన ఽ‘దింక్ అండ్ లెర్న్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ’ పరిశీలిస్తుంది. కంటెంట్ తయారీ, సమస్యల పరిష్కారాల (ట్రబుల్షూట్) సందర్భంగా ఈ డేటాను ఽథర్డ్‌పార్టీ (వాటితో ఒప్పందం చేసుకున్న ఇతర కంపెనీ) కూడా ఈ డేటాను వినియోగిస్తాయని ఆ సంస్థ తన ప్రైవసీ (గోప్యతా విధానం) పాలసీలో పేర్కొంది. పేద విద్యార్ధులకు ఉత్తమ విద్య, కంటెంట్ పేరిట బైజూ్సపై సర్కారు గొప్ప విశ్వాసాన్ని పెట్టుకుంది. పేదల ఆశలను తీరుస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి నిజంగా బైజూ్‌సకు ఆ సామర్ధ్యం ఉందా? అంటే ఇప్పటి వరకు అది నిరూపితమే కాలేదు.
బ్యాక్‌డోర్ బెనిఫిట్స్...బైజూ్‌సకు మరో ప్రయోజనం కూడా ఉంది. ఎలాగూ 8వ తరగతి వారికి ప్రభుత్వం ఉచితంగా కంటెంట్ ఇప్పిస్తోంది కదా...9,10 తరగతుల వారు కూడా తమ కంటెంట్ తీసుకోమ్మని డోర్‌టు డోర్ ప్రచారం చేయకుండా ఉండగలదా... ఈ పేరిట ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్లు తీసుకోకుండా ఉంటుందా...అన్న అనుమానాలు లేకపోలేదు. కేవలం కంటెంట్ మాత్రమే ఇచ్చి, మాక్ పరీక్షలకు అనుమతి ఇవ్వను అంటే ఏమిటి పరిస్థితి? ట్యూషన్ అయ్యాక మాస్టారు పెట్టే పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయన్నదే ప్రతీ తండ్రి ప్రామాణికంగా తీసుకుంటారు. మరి మాక్ పరీక్షలు, ఇతర ప్రీమియం సర్వీసుకు విద్యార్ధులు ఫీజు చెల్లించాలని షరతు పెడి తే? నిజానికి ఈ పేరుచెప్పి, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్ధుల నుంచి సబ్‌స్ర్కిప్షన్లు తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే సర్కారుకు ఇచ్చే ఉచిత కంటెంట్‌ను ఎరగాచూపి...ప్రైవేటు విద్యాసంస్థల నుంచి భారీగా కొత్త సబ్‌స్ర్కిప్షన్లు తీసుకునే అవకాశాలున్నాయి. ఇలాంటి మార్కెటింగ్ విధానాలు ఆ సంస్థ దగ్గర ఎన్నో ఉన్నాయి. దీన్ని బట్టి ఉచితంగా కంటెంట్ వల్ల లబ్దిపొందేది ఎవరు? లాభపడేది ఎవరు?
ఫేస్బుక్ బంధం కోసమేనా? ఫేస్బుక్ యజమాని మార్క్ జుకెర్‌బర్గ్ దంపతులు సంయుక్తంగా ‘జుకెర్‌బర్గ్ ఇన్షియేటివ్’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ పేరిట 2016లో బైజూ్‌సలో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. చైనా వీడియోగేమింగ్ కంపెనీ టెన్సెంట్ హోల్డింగ్స్ 2017లో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇలా అంతర్జాతీయంగా దాదాపు ఆరు కంపెనీల పెట్టుబడులు బైజూ్‌సలో ఉన్నాయి. వీటిల్లో ఫేస్బుక్ పెట్టుబడులే ఆసక్తికరంగా మారాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ సర్కారు తన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కోసం వాట్సప్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ ఇప్పుడు ఫేస్బుక్ సంస్థ అయిన మెటాలో భాగస్వామి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ప్రచారాలకోసం చాట్బోట్లను వాట్సాప్ కేటాయించదు. ఇది వాట్పా్సపాలసీ. ఈ రూల్స్ ప్రకారం వైసీపీకి చాట్‌బోట్ ఇవ్వరు. అందుకే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పేరిట చాట్‌బోట్ వినియోగానికి అనుమతి తీసుకొని ఒప్పందం చేసుకున్నారు. దాన్ని పరోక్షంగా రాజకీయంగాను వాడుకుంటారన్న విమర్శలు ఎలాగూ ఉన్నాయి. ఈ పరిణామం చోటుచేసుకున్న కొద్దిరోజులకే... ఫేస్బుక్ వ్యవస్ధాపకుల పెట్టుబడులున్న కార్పొరేట్ ట్యూషన్ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది
0 Comments:
Post a Comment