🔳పసి పిల్లలపై ప్రభుత్వం దాడి
- బడికోసం బస్సు యాత్రలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు
ప్రజాశక్తి- యంత్రాంగం :
రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌లో విలీనం చేపట్టి లక్షల మంది పిల్లలపై దాడి చేస్తోందని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విమర్శించారు. పలాస నుంచి పెనుగొండ వరకు పాఠశాలల పరిరక్షణ వేదిక చేపట్టిన బస్సు యాత్ర గురువారం ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించింది. గుంటూరు నగరం, నంది వెలుగు రోడ్డులోని ఉర్దూ ప్రాధమిక పాఠశాలను, యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామాన్ని ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, వై. శ్రీనివాసులు రెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, షేక్ .సాబ్జి, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించారు. మా స్కూల్ ఇక్కడే ఉంచండి.. దయ చేసి దూరంగా కలపొద్దు.. అంటూ విద్యార్థి మెహరున్నీసా మాట్లాడటం అందరిని కలచి వేసింది. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం పాఠశాలలు మూసివేస్తుందన్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. యాత్ర చేపటడ్టంలో మాకు వేరే ఉద్దేశం ఉందని చెబుతున్న మంత్రి బత్స సత్యనారాయణ క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోగలరా అని ఛాలెంజ్ చేశారు. పల్నాడు జిల్లాలోని, యడ్లపాడు మండలం, ఉన్నవ గ్రామాన్ని బృందం సందర్శించి, పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడారు. అంతకుముందు ఎన్టిఆర్ జిల్లాలోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఎంపిపి ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బృందం కలిసింది. అనంతరం మైలవరంలోని నాలుగో నంబరు పాఠశాలను సందర్శించింది. ఈ పాఠశాలను బాలుర హైస్కూల్లో విలీనం చేయడాన్ని నిలుపుదల చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పిడిఎఫ్ ఎమ్మెల్సీలను వేడుకున్నారు. అనంతరం చల్లపల్లిలోని చల్లపల్లి నారాయణరావు నగర్ ఎంపిపి పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. బస్సు యాత్రలో ప్రజల నుంచి అర్జీల ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీలు తెలిపారు. ఈ సమస్యను శాసన మండలిలో ప్రస్తావించి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
🔳పాఠశాలల విలీనం చిన్నారులకు శాపం
పాఠశాలల విలీనం చిన్నారులకు శాపంమాట్లాడుతున్న ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం
పీడీఎఫ్ ప్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం
పాఠశాలల విలీనాన్ని విభజన తక్షణం నిలిపివేయాలిగుంటూరుకు చేరిన పాఠశాల పరిరక్షణ బస్సు యాత్రగుంటూరు(విద్య), జూలై 28: ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం చిన్నారులకు శాపమని, విలీన ప్రక్రియతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ప్రభుత్వ ఈ చర్యను చిన్నారులపై చేసే దాడిగానే భావించాల్సి వస్తుందని పీడీఎఫ్ ప్లోర్‌లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం ధ్వజమెత్తారు. ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ఆపాలని కోరుతూ యుటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర గురువారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా పాత గుంటూరులోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే విభజన ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠశాలల విలీనంతో పేద, బడుగు, బలహీనవర్గాల బాల, బాలికలను విద్యకు దూరం అవుతారన్నారు. అనతరం పాఠశాలల పరిరక్షణవేదిక సభ్యులకు విద్యార్థుల వారి తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జి, వై శ్రీనివాసరెడ్డి, యుటీఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, సహాధ్యక్షుడు ఎఎస్ కుసుమకుమారి, ఎం హనుమంతరావు, పివీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి ఆదిలక్ష్మీ, ఎంకళాధర్, జి వెంకటేశ్వర్లు, ఎఎల్ శివపార్వతి, ఎండి దౌలా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, జేవీవీ, సీఐటియూ నాయకలుఉ పాల్గొన్నారు
📚✍️తరగతుల విలీనాన్ని తక్షణమే నిలిపేయాలి
♦️మండలి ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం
🌻విజయవాడ జూలై 28(ఆంధ్రజ్యోతి*): మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేయడాన్ని తక్షణమే నిలిపేయాలని శాసన మండలి ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడికోసం బస్సు యాత్రలో భాగంగా గురువారం ఎన్టీఆర్ జిల్లాల్లోని రామవరప్పాడు, మైలవరంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఈ సందర్భంగా విఠపు మాట్లాడారు. తల్లిదండ్రుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీలు ఐ.వి.వెంకటేశ్వర్లు, షేక్ షాబ్జి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వై. శ్రీనివాసులు రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment