✍️అమలు కాని విద్యా హక్కు చట్టం
♦️ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్
🌻అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేస్తామని, చట్టంలోని సెక్షన్ 12(1)(సి) మేరకు ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తామని కోర్టుకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమీర్ శర్మ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను జులై 19కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు 25ు సీట్లు ఉచితంగా ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యేగేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యం విచారణ సందర్భంగా 2022-23 నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ వేసిన అఫిడవిట్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వ్యాజ్యాన్ని పరిష్కరించింది. కోర్టు తీర్పు అమలుకాకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.
0 Comments:
Post a Comment