🔳ఆ ఉపాధ్యాయులకు మున్సిపల్ శాఖ నుంచే జూలై జీతాలు
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చిన మున్సిపల్ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల జూలై నెల జీతాలను మున్సిపల్ శాఖే చెల్లించనుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల వివరాలు, సర్వీసు రిజిస్టర్లు, ఇతర సమాచారం బదిలీ పూర్తికానందున ఈనెలకు మున్సిపల్ శాఖ నుంచే జీతాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆ శాఖను కోరింది. ఈ సమస్యను ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అనుకూలంగాస్పందించారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు.
0 Comments:
Post a Comment