✍️ఏమీ తేలలేదు!
♦️జీపీఎఫ్, హెల్త్ కార్డులు, ఆర్థిక అంశాలపై అస్పష్టత
♦️ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన చర్చలు
♦️ఆర్థిక శాఖ అధికారులు గైర్హాజరు
♦️ఆర్థికేతర అంశాలపై హామీలు
🌻అమరావతి, ఆంధ్రప్రభ: ఉద్యోగులు పెండింగ్ పీఆర్సీ, జీపీఎఫ్, డీఏ తదితర అంశాలపై బుధవారం సాయంత్రం 4 గంటలక ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై దీర్ఘ చర్చ జరిగింది. రాత్రి 9 గంటల వరకూ సమావేశం కొనసా గింది. అయతే, ఈ సమావేశానికి ఆర్ధిక శాఖా మంత్రి కార్యదర్శి హాజరు కాకపోవడంతో ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలు అడిగిన స్రీలు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రధానంగా నెలల కరబడి పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ కు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనిపించలేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తంచేశాయి. కూతురి వివాహం కోసం జీపీఎస్ నిధుల కోసం ధరఖాస్తు చేస్తే మనవరాలి జారసాలకు కూడా డబ్బు దాని శరిస్థితి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్, డీఏ తదితర సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ చ్చినా ఇప్పటి వరకూ ఆ హామీ నెరవేదనలేదన్నారు. ఈ సమా దేశంలో ప్రధానంగా హెల్త్ కార్డులపై చర్చ జరిగింది. ఆరోగ్య శ్రీ లబ్ది కారులకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగులకు ఆస్పత్రుల్లో లభించడం నీదని ఉద్యోగులు మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకొచ్చారు. 1రోగ్య శ్రీకి 21 రోజుల్లో గ్రీసీఛానెల్లో ప్రభుత్వం నుండి సొమ్ము !మ అవుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు, ప్రభుత్వ హెల్త్ కార్డులకు సొమ్ము రాదనే ఉద్దేశ్యంతో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఉర్కొన్నారు. ఆరోగ్య శ్రీకి వర్తించిన సేవలన్నీ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులకు కూడా వర్తింప జేయాలన్న డిమాండు అందుకు ఉప సంఘం సానుకూలంగా స్పందించింది. అలాగే సీపీఎస్ సంబంధించి వారి సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరగా, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప సంఘం పేర్కొంది. అదేవిధంగా పీఆర్సీసీలో 60 నుండి 62 సంవత్సరాలకు పదవీ విమరణ వయస్సును పెంచినా యూనివర్సిటీలు, గురుకులా లు వివిధ కార్పొరేషన్లలో ఇప్పటికీ అమలు కావడం లేదని, ఈ నెలాఖరుకు పదవీ విరమణ పెంపుపై ఉత్తర్వులు జాతీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయం. ఎన్ఎంఆర్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఉప సంఘం పేర్కొంది. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాల విషయంలో సానుకూలం గా స్పందించారని చర్చలు సంతృప్తికరంగా సాగాయని సచివాలయ సంస్స అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమకు రావల్సిన జీపీఎఫ్, డీఏ తదితర బకాయిలన్నీ తక్షణమే చెల్లించాలని కోరినట్లు అమరావ తి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు తెలి పారు, అందుకు ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చింద కు న్నారు. సమావేశంలో ఆర్ధిక, ఆర్థికేతర అంశాలపై చర్చ జరగ్గా ఆర్ధిక అంశాలకు సంబంధించి మంత్రి, అధికారులు హాజరుకాకపోవడం. తో సరైన స్పష్టత రాలేదన్నారు. కాగా, గ్రామ వార్డు సచివాలయా లకు సంబంధించి వ్యక్తిగత 2,500 మందిని రెగ్యులరైజ్ చేయలేని.. వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలివ్వాల్సిందిగా మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీఎసీజీవో అసోసి యేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు తెలిపారు. జీపీఎఫ్ మా యంపై ప్రశ్నించగా ఆర్థిక శాఖ అధికారులు సాంకేతిక లోపంగా చెప్పారన్నారు. నెలాఖరుకు తమకు రావల్సిన డీఏలు, జీపీఎఫు సంబంధించిన సొమ్మును జమ చేయాల్సిందిగా కోరామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 143 జీవోపై సంబంధిత ఉద్యో గులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా, శుక్రవారం సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నట్లు బండి వెల్లడించారు.
మంత్రుల కమిటీ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్రప్రభుత్వ సలహాదారు సుజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, కార్యదర్శులు హెచ్ అరుణ్ కి మార్, ప్రభుత్వ సలహాదారు పీ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీజీ ఈమి అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ఆర్టీసీ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వైవీ రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment