సీనియర్ ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబం నుంచి వచ్చినా పురంధేశ్వరి రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.
2004, 2009 సంవత్సరాలలో పురంధేశ్వరి లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 14వ లోక్ సభకు ఎన్నికైన సమయంలో ఆమె న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. 15వ లోక్ సభకు ఎంపికైన సమయంలో పురందేశ్వరి మానవ వనరుల శాఖా మంత్రిగా పని చేయడం గమనార్హం.
"in quest of utopia" అనే గ్రంథాన్ని ఆమె రచించారు. పురంధేశ్వరి భర్త పేరు దగ్గుపాటు వెంకటేశ్వర రావు కాగా ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు అనే సంగతి తెలిసిందే.
అయితే పురంధేశ్వరి ఒక సినిమాలో నటించారని చాలామంది సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సైతం తెలియదు. శ్రీ కృష్ణావతారం అనే సినిమాలో పురంధేశ్వరి కృష్ణుడి వేషం వేసి ఆ వేషంతో మెప్పించారు.
ఆ తర్వాత కూడా పురంధేశ్వరిని సినిమాలలో నటింపజేయాలని ఆయన అనుకున్నారు. అయితే సినిమాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉందని బసవతారకం భావించడంతో పురంధేశ్వరి సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది.
శ్రీ కృష్ణావతారం సినిమాలో పురంధేశ్వరి నటించినా ఎడిటింగ్ లో ఆమె నటించిన సన్నివేశాలను తొలగించారు.
ఆ సన్నివేశాలు సినిమాలో ఉండి ఉంటే మాత్రం పురంధేశ్వరి నటిగా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకునేవారు అని చాలామంది భావిస్తున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి మహిళలు సినిమాల్లో లేకపోవడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న మరి కొందరు స్టార్ హీరోలు గుర్తింపును సొంతం చేసుకున్నారు.
0 Comments:
Post a Comment