ఈ రోజుల్లో యూకే గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. అక్కడి ప్రధాని, కరోనా వ్యవహారం, ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు ఇలా అన్ని చర్చల్లో ఉంటున్నాయి.
ఇక ఇతర దేశాలతో పోలిస్తే యూకే వెళ్ళడం కాస్త సులభం అనే మాట కూడా వినపడుతుంది. అసలు యూకే అంటే ఏంటీ.? బ్రిటన్ ను యూకే అని ఎందుకు పిలుస్తారో చూద్దాం.
మనం మ్యాప్ ని చూస్తే ఇంగ్లండ్ ,వేల్స్ ,స్కాట్లాండ్ ఈ మూడు ఒకదానితో ఒకటి కలసి ఉన్న భూభాగాలుగా ఉంటాయి. దీనికి కొంచెం దూరంలో ఉండే ద్వీపం ఐర్లాండ్. ఇందులో రెండు భూభాగాలు ఉంటాయి. ఒకటి విడిపోయిన రెపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. ఇది ఇది ప్రత్యేక దేశం. దీంట్లో ఒక చిన్న ముక్క నార్థరన్ ఐర్లాండ్. ఇంగ్లండ్ ,వేల్స్ ,స్కాట్లాండ్ ఈ మూడింటిని కలిపి గ్రేట్ బ్రిటన్ అని పిలుస్తారు.
ఆ విధంగా కాకుండా ఇంగ్లండ్ ,వేల్స్ ,స్కాట్లాండ్ తో పాటు ఉత్తర ఐర్లాండ్ ముక్కని కలిపి దాన్ని యునైటెడ్ కింగ్డమ్ /యూ కె అని పిలుస్తారు. మూడో భాగంలో ఉండే మొత్తం ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, దేశంగా ఉన్న ఐర్లాండ్ రెపబ్లిక్ ని కలిపి బ్రిటిష్ ఐల్స్ అని పిలుస్తారు. అతేలస్టన్ అనే రాజు 10 వ శతాబ్దిలో పక్కనే ఉండే చిన్న రాజ్యాల విధేయత చూసి గ్రేట్ బ్రిటన్ ని ఏర్పాటు చేసాడు.
సెల్టిక్ రాజ్య పాలనలో ఉన్న వేల్స్ 1536, 1542 యూనియన్ చట్టాల ద్వారా బ్రిటన్ లో భాగం అయింది. ఆ తర్వాత స్కాట్లాండ్, ఇంగ్లండ్ మరియు వేల్స్ తో 1707 లో జతకట్టింది. ఈ కాలాన్నే యునైట్ కింగ్డమ్ పుట్టిన ఏడాదిగా చెప్తారు. అయితే మరికొందరు మాత్రం 1801యూనియన్ చట్టంలో ఇలా కలిసిన స్కాట్లాండ్ ని అధికారికమైనదిగా భావిస్తూ ఉంటారు.
అయితే 1801 చట్టం లోనే రాజ్యాలుగా ఉన్న ఇంగ్లాండ్ రాజ్యం అంటే ఇంగ్లాండ్ కింగ్డం, స్కాట్లాండ్ రాజ్యం అంటే స్కాట్లాండ్ కింగ్డంలు వీడివిడిగా చట్టాలు తెచ్చి సమైక్య రాజ్యంగా పేరు తెచ్చుకున్నాయి. అందుకే దాన్ని యునైటెడ్ కింగ్డం అంటారు.
0 Comments:
Post a Comment