పాఠం చెబుతూనే కుప్పకూలి.. ఉపాధ్యాయుడి మృతి
🌻కేవీబీపురం, న్యూస్ టుడే: తరగతి గది లో విద్యార్థులు చూస్తుండగానే ఓ ఉపాధ్యా యుడు ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలారు. ఆసుపత్రిలో చికిత్స అందించేలోపే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తిరుపతి జిల్లా కేవీబీపురం ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రధానోపాధ్యాయుడు వెంకట కృష్ణయ్య కథనం మేరకు.. తెలుగు ఉపాధ్యాయుడు హరిబాబు (45) పదో తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి అంటూ కుప్ప కూలారు. వెంటనే సిబ్బంది సాయంతో స్థానిక పీహెచ్ సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసేలోగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ప్రైవేటు పాఠశాలలో పని చేస్తుండగా.. బాబు పదో తరగతి చదువుతున్నాడు. హరిబాబుకు ఛాతీలో నొప్పిరావడం ఇదే మొదటిసారని కుటుంబ సభ్యులు తెలిపారు.
0 Comments:
Post a Comment