✍️ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
♦️స్పౌజ్ కోటాలో అక్రమాల ఫలితం
*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయుల బదిలీల్లో భార్యాభర్తల (స్పౌజ్) కోటాలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల పై గుంటూరు జిల్లాలో ఐదుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. 2020లో జరిగిన కౌన్సెలింగ్లో వీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, మరో 8 మంది ఉపాధ్యాయులు తప్పుడు ధ్రువ పత్రాలను సమర్పించారని గుర్తించి షోకాజ్ నోటీ సులు జారీ చేశారు. భార్యాభర్తల కోటాలో పాయింట్లు పొందిన వారు పని చేస్తున్న మండలం, సమీప మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగులు కోరుకోకుండా ఇతర ప్రాంతాల్లో ఐచ్ఛికాలు ఇచ్చుకుని బదిలీలు పొందారు. ఈ కారణంగా అన్యాయానికి గురైన ఉపా ధ్యాయులు అప్పట్లోనే గుంటూరు ఆర్జేడీకి ఫిర్యాదు చేసినా పట్టిం చుకోకపోవటంతో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలు వడనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ బుధ వారం బాధ్యులైన ఎం. శ్రీనివాసరావు, ఎం.రాధాకుమారి, పి. శివ నాగలక్ష్మికుమారి, టి. రుక్మిణిదేవి, ఎం. వీరజ్యోతిలను సస్పెండు చేశారు. మరో 8 మంది తప్పుడు వైద్య ధ్రువ పత్రాలు, గతంలో ఆయా కోటాల్లో పాయింట్లు వినియోగించుకోవడంలో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో వి.పద్మజ (గుంటూరులోని చౌత్రా హైస్కూల్), సీహెచ్ ఉష (దుగ్గిరాల మండలం), యు. గోపీకృష్ణ (చిన్నపాలెం), వి. హరిలక్ష్మీ కుమారి (మోరంపూడి), ఎం. హనుమా నాయక్ (ఎల్ఎస్ఎల్ హెచ్ఎం), జి. శ్రీదేవి (జడ్పీ హైస్కూల్, ఎస్బీ పురం), ఐ.సీతా రామయ్య (పీకేఆర్ పాలెం), పి. దీప్తి (వేజెండ్ల) ఉన్నారు.
0 Comments:
Post a Comment