✍️ఉపాధ్యాయులు కూలీ తీసుకునే జీతగాళ్లు కాదు
♦️ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు వారికి ఉంది
♦️మంత్రి బొత్స ప్రకటనపై మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు
🌻ఈనాడు, అమరావతి*: ప్రభుత్వ విధాన నిర్ణయాలను ఉపాధ్యాయులు ప్రశ్నించకూడదని మంత్రి బొత్స సత్యనా రాయణ అనడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిప డ్డాయి. చర్చల సందర్భంగా విలీనాన్ని ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాయని ఆయన చేసిన ప్రకటననూ ఖండించాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలకు ప్రభుత్వం అంగీకరించనందునే ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నాయి. అడ్డంకులున్నా అధికారులు అత్యుత్సా హంతో విలీనం చేస్తున్నారని, ఉన్నత పాఠశాలల్లో సౌక ర్యాలు లేకుండా విలీనం చేయడాన్ని తల్లిదండ్రులు వ్యతి రేకిస్తుంటే 5 వేల పాఠశాలలకు 400 బడుల్లోనే సమస్య ఉందని మంత్రి ప్రకటించడం సరికాదని వెల్లడించాయి.
♦️ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదనడం మంత్రి అవివేకం: రమేష్ పట్నాయక్
ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు విద్యారంగం గురించి మాట్లాడకూడదని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడడం చాలా అవివేకమని విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ విమర్శించారు. 'ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు తమ జీతభత్యాల సమస్యలతోపాటు విద్యారంగ సమస్యలపైనా మాట్లాడటం సాధారణ విషయం. ఉపాధ్యాయుడు కూలీ తీసుకునే జీతగాడు కాదు. వాళ్ల జీవితం విద్యారంగంతో మమేకమై ఉంటుంది. ఉపాధ్యాయులూ పౌడులే, వారికి ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ఉంటుంది' అని వెల్లడించారు.
♦️మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం: యూటీఎఫ్
పాఠశాలల విలీనంపై ప్రభుత్వ విధానపరమైన నిర్ణయా లను ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నించకూడదని, మార్పు లపై మాట్లాడకూదని మంత్రి బొత్స సత్యనారాయణ అన డంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంక టేశ్వర్లు, ప్రసాద్ వెల్లడించారు. 'ఈ విద్యా సంవత్సరంలో కిలోమీటరు దూరంలోని పాఠశాలలను విలీనం చేస్తామని, సహజ అడ్డంకులు లేనిచోట విలీనం చేయబోమని మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా చేశారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఉంటే రాష్ట్రంలో మెరుగైన విద్యా విధానం అమలు
అయ్యేది అనిఅంగీకరించనందునే ఉద్యమబాట పట్టాల్సిన వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమయ్యే విదానాన్ని అవ లంబించాలి' అని పేర్కొన్నారు.
♦️విలీనాన్ని అంగీకరించారని మంత్రిచెప్పడం అబద్ధం: ఫ్యాప్టో
ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారా యణ జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలు ఏవీ ఆచరణ లోకి రాలేదని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు. మంజుల అన్నారు. పాఠశాలల విలీనం, ఒకే మాధ్యమం అనే అంశాలు తమ ప్రభుత్వ విధానంలో భాగమని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై చర్చిద్దా మని చర్చల్లో మంత్రి తెలిపారు. కానీ, మేము విలీనం ఆపాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు కొనసాగించాలని డిమాండు చేశాం. ఉపాధ్యాయ సంఘాలు విలీనానికి అంగీకరించాయని మంత్రి చెప్పడం సరికాదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠశాలల విలీనాన్ని విరమించాలి. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలి. హేతుబద్ధీకరణ ఉత్తర్వులు రద్దుచేయాలి' అని డిమాండు చేశారు.
0 Comments:
Post a Comment