ఉపాధ్యాయుడు వీర్రాజుపై దాడి
ప్రజాశక్తి
మండపేట మండలంలోని ఏడిద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్న సిద్ధాంతపు వీర్రాజుపై ముగ్గురు యువకులు దాడి చేసి గాయపరిచారు. సోమవారం సాయంత్రం సమయంలో పాఠశాల ఆవరణలోకి వచ్చిన ముగ్గురు యువకులు పాఠశాలలోని వస్తువులను పాడు చేస్తున్న నేపథ్యంలో వాటిని పాడుచేయవద్దని చెప్పగా ఆ యువకులు ఉపాధ్యాయుడితో దురుసుగా ప్రవర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఉపాధ్యాయుడిపై పక్కన కిరణా షాప్ లో నక్కిన యువకులు కూల్ డ్రింక్ బాటిల్ తో తలపై బలంగా కొట్టడంతో ఆయన గాయాలు పాలుకాగా తోటి ఉపాధ్యాయులు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు.
0 Comments:
Post a Comment