గుండెకు ఆక్సిజన్ ను మోసుకెళ్లే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడితే.. heart rate అసమతుల్యంగా మారుతుంది. దీంతో కార్డియాక్ అరెస్ట్ లేదా గుండెపోటు వస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటు అకస్మత్తుగా రావడం వెనుక బలమైన కారణాలున్నాయంటున్నారు నిపుణులు.
అందులోనూ ఈ గుండెపోటు ఏ కాలంలోనైనా రావొచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మంది బాత్ రూం లో స్నానం చేస్తూ కూడా గుండెపోటు భారిన పడుతున్నారు. ఇందుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది..
కార్డియక్ అరెస్ట్, గుండెపోటు కు నేరుగా మన రక్తంతో సంబంధం కలిగి ఉంటుంది. గుండెకు ఆక్సిజన్ ను తీసుకెళ్లే ధమనుల్లో అడ్డంకి ఏర్పడినప్పుడు heart rate అసమతుల్యంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలోనే కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు వస్తాయి.
బాత్ రూం లో గుండెపోటు
ప్రస్తుత కాలంలో చాలా మంది బాత్ రూంలో గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా జరగడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి
మార్నింగ్ టాయిలెట్ కు వెళ్లినప్పుడు చాలా మంది పొట్టను క్లీన్ చేయడానికి ఒత్తిడి తెస్తారు. ఇక భారతీయ మరుగుదొడ్లను ఉపయోగించేటప్పుడు కూడా విపరీతమైన ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒత్తిడి గుండెకు ఆక్సిజన్ ను మోసుకెళ్లే ధమనులపై ఒత్తిడి కలుగజేస్తుంది. ఇది కాస్త గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఉష్ణోగ్రత ప్రభావం
ఇంటిలోపలున్న గదులతో పోల్చితే బాత్ రూం లోనే చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ తడిగా ఉండటం వల్ల బాత్ రూముల్లో ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
అయితే బాత్ రూం కి వెళ్లినప్పుడు శరీరం ఆ ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి, రక్తప్రసరణను నిర్వహించడానికి ఎక్కువ శ్రమ పడుతుంది. ఇది కూడా గుండెపోటుకు దారితీస్తుంది.
రక్తపోటు వ్యత్యాసం
మార్నింగ్ మన రక్తపోటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చల్లని లేదా వేడి నీళ్లతో స్నానం చేసినప్పుడు రక్తపోటు మరింత పెరుగుతుంది. దీంతో కూడా బాత్ రూముల్లో గుండెపోటు బారిన పడతారు.
గుండె పోటును నివారించే మార్గాలు
టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఎక్కువ సేపు ఒకే పొజీషన్ లో కూర్చోకూడదు. ఇలా కూర్చుంటే గుండెపోటు లేదా కార్డియాక్ బారిన పడొచ్చు.
సాన్నానికి ఉపయోగించే నీళ్లను ముందుగా పాదాలపై జల్లాలి. ఆ తర్వాతే శరీరాన్ని తడపాలి. తలకు తేలికపాటిని నీటిని ఉపయోగించాలి. ఇది మీ శరీర, బాత్ రూం ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
బాత్ టబ్ లు కూడా గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. బాత్ టబ్ లో ఎక్కువ సేపు కోర్చువడం వల్ల ధమనులపై చెడు ప్రభావం పడుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అందుకు బాత్ టబ్బుల్లో ఎక్కువ సేపు కూర్చోకండి.
గుండెపోటు లక్షణాలు: గుండెపోటు లక్షణాలు చాలా అకస్మికంగా వస్తాయి. వీటినీ కాస్త ముందుగా తెలుసుకుంటే ముందుగా హాస్పటల్ కు వెళ్లొచ్చి చికిత్స తీసుకోవచ్చు.
ఛాతిలో నొప్పి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
బలహీనంగా అనిపించడం
అయితే డయాబెటీస్ పేషెంట్లకు గుండెపోటు ఎలాంటి లక్షణాలు చూపకుండా అటాక్ చేసుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.
ఒత్తిడి, ఆందోళన
వాంతులు, మగత
0 Comments:
Post a Comment