✍️తరగతులు తరలించొద్దంటూ ఆందోళన
♦️మ్యాపింగ్ నుంచి తొలగించిన విద్యాశాఖ
*🌻ప్రజాశక్తి - గుంటూరు*
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని తరగతులను సమీపంలోని హైస్కూల్లో విలీనం చేయొద్దంటూ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల ప్రాథమికోన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఆందోళనచేశారు. మంచాల ప్రాథమికోన్నత పాఠశాలలోని 6, 7 తరగతులను మూడు కిలో మీటర్లలో ఉన్న పొన్నూరు మండలం వెల్లలూరు హైస్కూల్లో విలీనం చేస్తూ విద్యా శాఖాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజను కలిసి వినతిపత్రం అందజేశారు. నిత్యం వాహనాలు ప్రయాణించే హైవేపై చిన్న పిల్లలను బస్సుల్లో ఎలా పంపించాలని ప్రశ్నించారు. తరగతులు తరలింపు ఆపాలని విజ్ఞప్తి చేశారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగానే ప్రతిపాదనలు పంపించామని డిఇఒ వారికి తెలిపారు. దీంతో తల్లిదండ్రులు మంచాల యుపి పాఠశాల వద్ద ఆందోళన చేశారు. పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని పట్టుబట్టటంతో అధికారులు మ్యాపింగ్ నుంచి పాఠశాలను తొలగించారు.
0 Comments:
Post a Comment