🌼విలీనం'పై విన్నపాల వెల్లువ
పాఠశాలలపై వైసీపీ నుంచే అభ్యంతరాలు
» మంత్రి బొత్స రాసిన లేఖకు భారీ స్పందన
» దాదాపు 60 మంది ఎమ్మెల్యేల వినతులు
» 200 కు పైగా స్కూళ్ల విలీనంపై వ్యతిరేకత
అమరావతి , జూలై 18 ( ఆంధ్రజ్యోతి ) : పాఠశాలల విలీనంపై అధికార పార్టీ నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి . పాఠశాలల విలీనం విషయంలో అభ్యంతరాలుంటే తెలపాలని విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ఎమ్మెల్యే లకు రాసిన లేఖకు భారీ స్పందన వచ్చింది . సోమవారం అసెంబ్లీలో జరిగిన రాష్ట్ర పతి ఎన్నిక పోలింగ్ సమయంలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు .. తమ నియోజక వర్గాల్లో పాఠశాలల విలీనంపై తల్లిదండ్రుల నుంచి వస్తున్న అభ్యంతరాలను మంత్రికి వివరించారు . 200 కు పైగా పాఠశాలల విలీనంపై ఎమ్మెల్యేలు అభ్యంత రాలు వెల్లడించినట్లు తెలిసింది . చిన్నపిల్లలు పెద్ద రహదారులు దాటాల్సి రావడం , ట్రాఫిక్ సమస్యలు , పక్క గ్రామాలకు వెళ్లడంలో ఇబ్బందులను ఎమ్మెల్యేలు విన తుల్లో ప్రధానంగా ప్రస్తావించారు . 3 , 4 , 5 తరగతుల విద్యార్థులను పక్క ఊర్లకు పంపి చదివించడం పేదలకు ఇబ్బంది అవుతుందని , దానిని పరిగణనలోకి తీసుకో వాలని ఎమ్మెల్యేలు కోరారు . కొన్నిచోట్ల అధికారులతో విచారణ జరిపి , మరీ ఇబ్బం దిగా ఉంటే అక్కడ విలీనంపై పునరాలోచన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు .
0 Comments:
Post a Comment