ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు తెలియకుండా చేసే తప్పులు అపజయానికి దారి తీస్తాయి. ఈ తప్పులు మనిషి శ్రమను కూడా వృథా చేస్తాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్య పేర్కొన్నారు.
అటువంటి పరిస్థితిలో ఈ తప్పులను గుర్తించి, తిరిగి చేయకూడదని ఆచార్య చాణక్య తెలిపారు.
అనుకరణ చేయవద్దు:
వేరొకరిని అనుకరిస్తూ ఏ పనీ చేయవద్దు. మీ అర్హతలు, మీకు ఏది సరైనది? ఫలితం ఏమిటో తెలుసుకోవడం ద్వారా నిర్ణయాలు తీసుకోండి. నేను ఈ పనిలో విజయం సాధించగలనా లేదా అని ప్రశ్నించుకోండి.
మీకు సమాధానం ఖచ్చితంగా వస్తే, ఒక ప్రణాళికను రూపొందించిన తర్వాత పని ప్రారంభించండి. ప్రణాళిక లేకుండా చేసే పని వైఫల్యానికి దారి తీస్తుంది.
వైఫల్య భయం:
మీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు, వైఫల్య భయం లేదా ఆలోచన మిమ్మల్ని వెంటాడకుండా చూసుకోంది. ఫెయిల్యూర్ అనే ఆలోచన మనసులోకి వస్తే ఆ పనిని అర్ధంతరంగా ముగిస్తారు. అటువంటి పరిస్థితిలో వైఫల్యం ఎదురవుతుంది.
పనిని అసంపూర్తిగా వదిలివేయడం:
మీరు ఏదైనా పనిని ప్రారంభించినపుడు దానిని అసంపూర్తిగా వదిలివేయవద్దు. ఒక్కోసారి చాలామంది ఎంతో కష్టపడినా గెలుపును చూడకుండానే మనసు మార్చుకుంటారు. ఇలా చేయవద్దు.
పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలి. లేకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు.
మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకోవద్దు:
కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకపోవడమే మంచిది. విజయం సాధించే వరకు లేదా మీ ఆలోచనలను ఎవరికీ చెప్పకండి. లేకపోతే శత్రువులు లేదా పోటీదారులు మీకు సమస్యలను సృష్టిస్తారు.
0 Comments:
Post a Comment