విద్యామంత్రి బొత్స, ఎమ్మెల్యే లకు రేషనలైజేషన్, స్కూల్స్ Merging గురించి వ్రాసిన లేఖ...
✍️విలీన సమస్యలను సరిదిద్దాలి♦️ఎమ్మెల్యేలకు బొత్స లేఖలు
🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియలో సమస్యలుంటే లిఖిత పూర్వకంగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం లేఖలు రాశారు. ఈ నెల 18న భారత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి వచ్చే సమయంలో తనకు అందించాలని తెలిపారు. విద్యాహక్కు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పలు సంస్కరణలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని వివరించారు. విద్యార్థులకు వెసులుబాటు ఉండేలా హేతుబద్ధీకరణకు ఒక కిలోమీటరు పరిధిని నిర్దేశించామని తెలిపారు. పాఠశాలలకు వెళ్లడానికి, పెద్ద రహదారులు, వాగులు, వంకలను దాటాల్సిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఎదురైతే వాటిని సరిదిద్దే చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి విద్యార్థులకు మేలు కలిగేలా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తికావడానికి సహకారం అందించాలని కోరారు
0 Comments:
Post a Comment