✍️సచివాలయ కార్యదర్శులకు గోరుముద్ద, టీఎంఎఫ్ బాధ్యతలు
♦️విధివిధానాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
🌻సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జగనన్న గోరుముద్ద, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్) నిర్వహణను గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా.. మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ మహమ్మద్ దివాన్ మైదాన్ ఆయా కార్యదర్శులు నిర్వర్తించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసీజర్ (ఎస్ఓపీ)లను విడుదల చేశారు.
♦️మహిళా పోలీసుల పాత్ర
ఎమర్జెన్సీ నెంబర్లయిన 112, 100లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పాఠశాల పిల్లలకు పోలీసుల సహకారం అందుబాటులో ఉండేలా ఉపయోగకరమైన మెటీరియల్‌ని అందించాలి. పాఠశాలలను నెలనెలా సందర్శిస్తూ, అవగాహన శిబిరాలు నిర్వహించాలి.
♦️విద్యా, సంక్షేమ కార్యదర్శి పాత్ర
వారానికి మూడుసార్లు పాఠశాలలను సందర్శించి గోరుముద్ద నాణ్యతను పరిశీలించాలి. ఐఎంఎంఎస్ యాప్‌లో ఫీడ్‌బ్యాక్ రాసి ఫొటోలను అప్లోడ్ చేయాలి. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించాలి. పాత్రల పరిశుభ్రతను గమనించి హెచ్ఎంలకు సహకరించాలి. అలాగే, తల్లిదండ్రుల కమిటీతో చర్చించాలి. టాయిలెట్లు, వాష్బేసిన్లు, యూరినల్స్ ఇతర అనుబంధ వస్తువుల శుభ్రతను గమనించాలి. యాప్‌లో ఫొటోలను అప్లోడ్ చేయాలి.
♦️ఇంజినీరింగ్ అసిస్టెంట్ పాత్ర
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఇంజినీరింగ్ అసిస్టెంట్ నెలకొకసారి పాఠశాలను సందర్శించాలి. ఫీడ్‌బ్యాక్‌ను డేటాబేస్‌లో అప్లోడ్ చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమైన పరికరాలు, క్లీనింగ్ మెటీరియల్‌ను పరిశీలించాలి. మరమ్మతులు చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ భౌతికంగా అందుబాటులో ఉండాలి.
♦️ఏఎన్ఎమ్ పాత్ర
ఆశా, జీఎస్‌డబ్ల్యూఎస్ సిబ్బందితో పాటు ఏఎన్ఎంలు నెలవారీగా పాఠశాలలను సందర్శించాలి. పిల్లల ఎత్తు, బరువు వయస్సుకు తగిన పెరుగుదలను తనిఖీ చేయాలి. పిల్లల రక్తహీనత లక్షణాలు గుర్తించాలి. బలహీనంగా ఉన్న వారి పర్యవేక్షణ నిమిత్తం సిబ్బందికి సూచనలు చేయాలి. మురుగునీరు నిలవ ఉండకుండా చూడాలి. మంచినీరు, పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలి.
0 Comments:
Post a Comment