కన్నీళ్లలోని ఎలక్త్రోలైట్స్ కారణంగా కంట్లో బాక్టీరియా, ఇతర క్రిములు పెరగకుండా మనకి రక్షణ ఉంటుంది. చాలా మంది కన్నీళ్లను తేలికగా తీసేస్తారు గాని.
అనేకరకాల కార్బనిక, అకార్బనిక సమ్మేళనాలు, ప్రోటీన్లు, లవణాలు ఉంటాయి. ఈ లవణాలలో ముఖ్యమైనవిగా సోడియం, పొటాషియంను చెప్తారు.
అందుకే కంట్లో నుంచి వచ్చే నీళ్ళు ఉప్పగా ఉంటాయి. కన్నీళ్లు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి. అందుకే ఒకసారి ఉప్పగా ఉంటే మరోసారి తక్కువ ఉప్పగా ఉంటాయి.
కన్నీళ్ళల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బెసల్ కన్నీళ్లు. మన కళ్ళు ఎప్పుడూ పొడిబారకుండా ఉంచేవి ఈ కన్నీళ్లు.
కను రెప్పలు మూస్తున్న ప్రతీసారి కన్నీటి గ్రంధులలో నుంచి వస్తాయి. నిద్రలో ఉన్నప్పుడు పుసిగా మారేది ఇవే. ఇవి ఎక్కువ ఉప్పగా ఉంటాయి.
రిఫ్లెక్స్ కన్నీళ్లు అనేది రెండో రకం. దుమ్ము, ధూళి, ఉల్లిపాయలు తరిగెటప్పుడు విడుదలయ్యే కెమికల్స్ నుండి కళ్ళను రక్షిస్తాయి.
మంట కలిగేవి ఏవి కంట్లో పడినా రక్షణ ఉంటుంది. ఇక సైకిక్ కన్నీళ్లు అని మరో రకం ఉంది.
ఇవి మనలో ఉండే ఎమోషన్స్ తో వస్తాయి. అయితే ఇతర కన్నీటిలో లేని హార్మోన్లు, ప్రోటీన్లు ఉండగా. ఇవి రావడంతో మన బాధ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.
0 Comments:
Post a Comment