దీని ప్రారంభ ధర రూ. 53,063. ఇది 5 వేరియంట్లు మరియు 8 రంగులలో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ.65,358 నుంచి ప్రారంభమవుతోంది. 97.2cc BS6 ఇంజన్ హీరో HF డీలక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 7.91 బిహెచ్పి పవర్ మరియు 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
TVS Sport: TVS స్పోర్ట్ దాని 73 kmpl మైలేజీ కారణంగా కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. ఇది ఆరు రంగుల్లో లభిస్తోంది. బైక్ సింగిల్ సిలిండర్ ఫోర్-స్ట్రోక్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో కూడిన ఎయిర్-కూల్డ్ స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్‌ను పొందుతుంది. 10 లీటర్ ట్యాంక్ ఈ బైక్ సొంతం. దీని ధర రూ 58,900 నుంచి ప్రారంభమవుతుంది.
Bajaj CT 110: CT 110 అనేది కొన్ని ప్రీమియం ఫీచర్ల కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడే వినియోగదారుల కోసం. ఈ బైక్‌లో LED DRLలు, రబ్బర్ ట్యాంక్ ప్యాడ్లు, బంపర్లు, మందపాటి ప్యాడెడ్ శాడిల్, పెరిగిన ఎగ్జాస్ట్ మరియు ఇంకెన్నో ఉన్నాయ్. దీని 115.45 cc 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్ 7,000 rpm వద్ద 8.6 hp మరియు 5,000 rpm వద్ద 9.81 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 58,200 (ఎక్స్-షోరూమ్).
Bajaj Platina 110: ఈ బైక్ 115.5cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ ఇంతకుముందు ప్లాటినాలో నాలుగు గేర్లతో అందుబాటులో ఉంది. 115సీసీ ఇంజన్ 8.6PS పవర్ మరియు 9.81Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇంజిన్ మునుపటి కంటే మెరుగ్గా ఉంది.
ఎందుకంటే ఇది మరింత శుద్ధి చేయబడింది. గేర్‌బాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత కూడా ఇంజిన్ స్మూత్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు హైస్పీడ్‌లో బైక్ నడిపినా కొంచెం వైబ్రేషన్ మాత్రమే ఉంటుంది. దీని ధర ₹63,300 నుంచి ప్రారంభమవుతుంది.
TVS Star City Plus: ఈ లిస్ట్ లో TVS నుంచి రెండవ బైక్. ఇది 70 kmpl మైలేజీతో మంచి ఇంధన-సమర్థవంతమైన బైక్. ఏది ఏమైనప్పటికీ.. బజాజ్ ప్లాటినా 110తో పోల్చితే జాబితాలో స్టార్ సిటీ ప్లస్ యొక్క స్థానం డౌన్ లోనే ఉంది. దీని ధర 70,000 నుంచి ప్రారంభమవుతోంది. ఇది సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజిన్ నుంచి దాని శక్తిని పొందుతుంది. బైక్ ట్యాంక్‌లో 10 లీటర్ల పెట్రోల్ నింపుకోవచ్చు.
0 Comments:
Post a Comment