హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar Open University) (బీఆర్ఏఓయూ) - గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా అడ్మిషన్స్ పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
డిగ్రీ ప్రోగ్రామ్‌లు: బీఏ, బీకాం, బీఎస్సీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఇంగ్లీష్ లేదా తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. బీఏ, బీఎస్సీ ప్రోగ్రామ్‌లకు ఉర్దూ మాధ్యమం కూడా అందుబాటులో ఉంది.
అర్హత: బీఏ, బీకాం ప్రోగ్రామ్‌లకు ఏదేని గ్రూప్‌తో; బీఎస్సీలో ప్రవేశానికి సైన్స్ గ్రూప్‌తో ఇంటర్/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్; ఏపీ/ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ప్రోగ్రాములు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు.
ఎంఏ స్పెషలైజేషన్లు: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ.
ఎమ్మెస్సీ స్పెషలైజేషన్లు: మేథమెటిక్స్, అప్లయిడ్ మేథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ.
అర్హత: ఎంబీఏలో ప్రవేశానికి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టీఎస్/ ఏపీ ఐసెట్ 2022 అర్హత పొంది ఉండాలి. ఎంఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. లాంగ్వేజెస్(ఇంగ్లీష్ మినహా)లో ఎంఏ ప్రోగ్రామ్‌నకు డిగ్రీ స్థాయిలో సంబంధిత లాంగ్వేజ్‌ని సెకండ్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. ఎంకాంలో ప్రవేశానికి బీకాం/ బీబీఏ/ బీబీఎం/ బీఏ(కామర్స్) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీలో ప్రవేశానికి సంబంధిత సబ్జెక్ట్లతో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. మేథమెటిక్స్, అప్లయిడ్ మేథమెటిక్స్ స్పెషలైజేషన్లకు బీఈ/ బీటెక్ అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. సైకాలజీకి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు; ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కు ఏదేని సైన్స్ డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది.
స్పెషలైజేషన్లు: మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్ స్టడీస్.
సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. విభాగాన్ని అనుసరించి పదోతరగతి/ ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
విభాగాలు: ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవల్‌పమెంట్, ఎన్జీఓస్ మేనేజ్మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31
వెబ్సైట్: www.braou.ac.in
0 Comments:
Post a Comment