Acidity Remedies At Home: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో ఎసిడిటీ సమస్యలు రావడం సర్వసాధారణమైనది.
ఈ సమస్యలతో బాధపడుతున్నట్లైయితే పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర భాగాల్లో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ హోం రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరికాయ:
తరుచుగా అసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటే.. ఉదయం పూట 1 ఉసిరికాయను తినాలని నిపుణులు చెబుతున్నారు. పొట్ట సమస్యలను, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది.
అజ్వైన్:
అజ్వైన్ నానబెట్టిన నీరు నిత్యం ఉదయం పూట తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం, వికారం వంటి సమస్యలను తగ్గుతాయి.
బెల్లం:
ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి భోజనం తర్వాత బెల్లం తినండి. ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
జీలకర్ర:
అసిడిటీ రాకుండా ఉండాలంటే జీలకర్రతో తయారుచేసిన పొడిని ఆహారం వండే క్రమంలో వాడుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ రసం:
పుచ్చకాయలో చాలా రకాల పోషక విలువలుంటాయి. ఈ రసం తాగడం వల్ల పొట్టకు సంబంధించిన ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
పాలు:
ఎసిడిటీ వల్ల కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చల్లటి పాలు తాగాలని నిపుణులు తెలుపుతున్నారు.
0 Comments:
Post a Comment