ఆధార్ కార్డ్... ప్రతీ ఒక్కరి దగ్గర ఉండే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా సబ్మిట్ చేస్తుంటారు. అయితే ప్రతీ చోటా ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరిగా ఇవ్వాలా?
అసలు ఏఏ సేవలు పొందడానికి ఆధార్ నెంబర్ (Aadhaar Number) తప్పనిసరి? ఎక్కడెక్కడ ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు? ఇలాంటి సందేహాలు ఆధార్ కార్డ్ హోల్డర్స్‌లో మామూలే. ఆధార్ కార్డును ప్రతీ చోటా ఇవ్వాల్సిన అవసరం లేదు.
అయితే కొన్ని సేవలు పొందడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏఏ సేవలు పొందడానికి ఆధార్ నెంబర్ ఇవ్వాలో తెలుసుకోండి.
ID Proof or Address Proof: మీరు ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలనుకుంటే మీ ఆధార్ కార్డును సమర్పించవచ్చు. ఐడీ, అడ్రస్ మాత్రమే కాదు, మీ వయస్సు, జెండర్ ఇతర వివరాలను ప్రూఫ్‌గా ఇచ్చేందుకు ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది.
Passport: విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కావాల్సిందే. కొత్త పాస్‌పోర్టుకు అప్లై చేయాలన్నా, పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయాలన్నా ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.
Education: భారతదేశంలోని యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం, నీట్ లాంటి కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ కోసం ఆధార్‌ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. అయితే స్కూళ్లల్లో అడ్మిషన్లకు పిల్లల ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
Banking: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. సేవింగ్స్ అకౌంట్ కేటగిరీలోని అన్ని అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డ్ తప్పనిసరి.
Cooking Gas: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌కు అప్లై చేయాలనుకుంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్న అకౌంట్లోకి వస్తుంది.
Pension: పెన్షన్ స్కీమ్‌లో పెన్షన్ బెనిఫిట్స్ పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి.
Ration Shops: రేషన్ షాపుల్లో బియ్యం, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవాలన్నా ఆధార్ నెంబర్ తప్పనిసరి. రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింకై ఉంటుంది కాబట్టి, రేషన్ షాపుల్లో ఆధార్ నెంబర్ ద్వారానే వివరాలను గుర్తించి రేషన్ సరఫరా చేస్తుంది ప్రభుత్వం.
Provident Fund (PF): ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఉద్యోగి లేదా యాజమాన్యం పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం కుదరదు.
Non-Resident Indians (NRIs): ఎన్ఆర్ఐలు ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఆధార్ నెంబర్‌ను ప్రూఫ్‌గా సబ్మిట్ చేయాలి.
PAN card: ఇక పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం పాన్ కార్డ్ హోల్డర్స్ తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.
0 Comments:
Post a Comment