ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరు కష్టపడతారు. కానీ కొంత మంది మాత్రమే .. ఉద్యోగం సాధించడంలో సక్సెస్ అవుతారు. దీని కోసం పగలనక, రాత్రనక నిరంతరం శ్రమిస్తారు.
అయితే, ఇంత కష్టపడ్డాక.. కొందరు ఉద్యోగాలు సాధిస్తారు. కొందరు ప్రజలకు, తమ వంతుగా పాటుపడతారు. మరికొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. తాము.. చేయాల్సిన పనికి కూడా లంచం తీసుకుంటారు.
లంచం ఇవ్వందే.. ఏపనిచేయరు. తమ వద్దకు వచ్చిన ఫైల్ ముందుకు వెళ్లాలంటే.. చేతిలో డబ్బులు పడాల్సిందే. అయితే, కొంత మంది లంచాలు ఇస్తుంటారు. కొన్ని సార్లు బాధితులు సీబీఐ అధికారులను ఆశ్రయిస్తుంటారు.
ఈ క్రమంలో అధికారులు వారిని మాటు వేసి పట్టుకుంటారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. హర్యానా విజిలెన్స్ అధికారులు ప్రభుత్వ అధికారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. వీరికి.. కొన్ని రోజులుగా పలు శాఖల ఉద్యోగులు లంచం తీసుకుంటున్నట్లు వారికి ఫిర్యాదులు అందాయి.
దీంతో అధికారులు.. ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో ఇప్పటి దాక.. గెజిటెడ్ అధికారులతో పాటు.. 83 మంది గవర్నమెంట్ ఉద్యోగులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రెవెన్యూ శాఖకు చెందిన 18 మంది, పోలీసు సిబ్బందికి చెందిన 23 మంది, విద్యుత్ శాఖకు చెందిన 15 మంది, పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 8 మంది, ఎక్సైజ్, పన్నుల శాఖకు చెందిన ఒక్కొక్కరు ముగ్గురు ఉన్నారు.
పోలీసుల ప్రకారం.. నిందితులు వేర్వేరు కేసుల్లో రూ.5,000 నుంచి రూ. 5 లక్షల వరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పట్టణ స్థానిక సంస్థల విభాగానికి చెందిన ఇద్దరు చీఫ్ ఇంజనీర్లను ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు అరెస్టు చేయగా, హర్యానా సివిల్ సర్వీస్ (హెచ్‌సిఎస్) అధికారిని ట్రాప్ కేసు దర్యాప్తు సందర్భంగా అరెస్టు చేసినట్లు హర్యానా విజిలెన్స్ బ్యూరో అధికారి తెలిపారు.
అదే విధంగా.. 5 లక్షలు లంచం తీసుకున్న జిల్లా టౌన్ ప్లానర్‌ను విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేశారు. అతనితో పాటు సహ నిందితుడైన తహసీల్దార్‌ను కూడా అరెస్టు చేశారు. మరో ఘటనలో.. 50,000 లంచం తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను కూడా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
50,000 అక్రమంగా తృణీకరించినందుకు డిప్యూటీ ఎక్సైజ్, టాక్సేషన్ కమిషనర్‌ను కూడా బ్యూరో అరెస్టు చేసింది.
లంచం ఫిర్యాదులను దాఖలు చేయడానికి హర్యానా విజిలెన్స్ బ్యూరో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-2022, 1064ను జారీ చేసింది.
0 Comments:
Post a Comment