✍️500 బడుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 70మంది ఎమ్మెల్యేల లేఖలు
♦️విలీనంపై మరోసారి విద్యాశాఖ సర్వే
🌻ఈనాడు, అమరావతి: పాఠశాలల విలీనాన్ని వ్యతిరే కిస్తూ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను పాఠశాల విద్యాశాఖకు పంపారు. వాటిని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చాలా మంది ఎమ్మెల్యేలు మండల, జిల్లా విద్యాధికారులు ఇచ్చిన నివేదికలతో కలిపి లేఖలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధ వారం వరకు 70మంది ఎమ్మెల్యేలు 500బడులకు సంబంధించి లేఖలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విలీనంపై సర్వేకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన నమూనాను విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల విద్యార్థుల సంఖ్య, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేరినవారు, తరగతి గదులు, విలీనానికి ముందు, తర్వాత ఉపాధ్యాయులు, తదితర వివరాలను సేకరిస్తోంది. పాఠశాల విద్యాశాఖపై శుక్రవారం సీఎం జగన్ సమీక్షించనున్నారు.
0 Comments:
Post a Comment