దిశ, ఫీచర్స్ : గడియారాలు లేకుండా వాటి చుట్టూ అల్లుకున్న సాంకేతికత అసాధ్యం. అంతేకాదు శాటిలైట్ నావిగేషన్ నుంచి మొబైల్ ఫోన్స్ వరకు అనేకానేక విషయాలకు సమయమే 'హిడెన్ జెమ్'.
ఇంతకీ సమయం మనకు ఎలా తెలుస్తుంది? సమయపాలన వ్యవస్థకు మనం ఎలా చేరుకున్నాం? ఇందులో కచ్చితత్వం ఎలా సాధ్యమైంది? భవిష్యత్తులో ఇది ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే.. సమయమంటే ఏమిటని అన్వేషించాలంటే... క్లాక్ ఫేస్‌ను చూస్తే అర్థం కాకపోవచ్చు. కానీ కొంచెం లోతుగా వెళితే మాత్రం దాని విలువ మరింత స్పష్టంగా అవగతమవుతుంది.
విశ్వమంతా 'సమయం'పై ఆధారపడే నడుస్తుంది కాబట్టి, ఒక్క సెకన్.. కాదు! కాదు! నానో సెకన్ తేడా వచ్చినా ఈ భూగోళం మొత్తం తలకిందులైపోతుందంటే అతిశయోక్తి కాదు. అందువల్లే లిప్తపాటును కూడా లెక్కించేందుకు లండన్‌లోని నేషనల్ ఫిజికల్ లేబొరేటరీలో సెకన్లు, నిమిషాలు సహా గంటల చొప్పున కచ్చితమైన విలువను అందించే గడియారాలను పొందుపరిచారు.
వాటినే 'హైడ్రోజన్ మెజర్స్'గా పిలుస్తుంటారు. ఇలాంటి ముఖ్యమైన అణు గడియారాలు దాదాపు 400 మంది దగ్గర ఉండగా.. వాటిని ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ప్లేస్ చేశారు.
పారిశ్రామికీకరణతో..
ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే సమయాన్ని పాటించడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకంటే స్థానిక గడియారం ద్వారా మాత్రమే సమయం నిర్వచించబడుతుంది. ఉదాహరణకు ఒక చోట మధ్యాహ్న సమయమైతే మరోచోట రాత్రి ఏడు కావచ్చు. ఇప్పటికే వందలాది విభిన్న సమయ ప్రమాణాలతో అమెరికా పనిచేస్తోంది.
ఒకప్పటి మానవ చరిత్ర చూసుకుంటే ప్రజలు తమకు అవసరమైనప్పుడు మాత్రమే పనిచేశారు కాబట్టి వారు సమయం గురించి ఆలోచించలేదు. ఒకవేళ సమయాన్ని తెలుసుకోవాలనుకుంటే సూర్యుడి తాపాన్ని లేదా టౌన్ క్లాక్ చెక్ చేయడం ద్వారా లేదంటే చర్చి బెల్ ద్వారా మాత్రమే తెలుసుకునేవాళ్లు. అయితే, పారిశ్రామిక యుగం పుంజుకోవడంతో మెల్లగా మార్పు మొదలైంది.
ప్రభావవంతంగా పనిచేసేందుకు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కచ్చితమైన సమయపాలన అవసరమైంది. దీంతో కర్మాగారాలు నిర్ధేశించిన గంటల్లో శ్రామిక శక్తిని ఉపయోగించుకోవచ్చు. రైళ్లు కూడా ఎదురెదురుగా రాకుండా సమయం బట్టి బయలుదేరవచ్చు. బ్యాంకర్లు ఆర్థిక లావాదేవీలకు టైమ్ స్టాంప్ చేయవచ్చు.
అతి ముఖ్యమైన యంత్రం:
పారిశ్రామిక విప్లవానికి గడియారమే అతి ముఖ్యమైన యంత్రం తప్ప ఆవిరి యంత్రం లేదా అంతర్ మోటార్ కాదు. ఆవిరి ఇంజిన్లు.. పవర్‌తో కూడిన కర్మాగారాలు, రవాణాకు ఉపయోగపడొచ్చు కానీ అవి వ్యక్తులను, వారి కార్యకలాపాలను సమకాలీకరించలేకపోయాయి. ఆ తర్వాత కొంతకాలానికి ప్రీమియర్ ఆర్బిటర్ లండన్‌లోని గ్రీన్విచ్లో అమర్చిన అధునాతన యాంత్రిక గడియారాలు 'నిజమైన' సమయాన్ని చూపించాయి.
1833లో టైమ్కీపర్లు లండన్‌లోని రాయల్ గ్రీన్విచ్ అబ్జర్వేటరీలో ఒక స్తంభానికి బంతిని జోడించారు. ఇది ప్రతిరోజూ 13:00 గంటలకు తగ్గుతుంది. తద్వారా వ్యాపారులు, కర్మాగారాలు, బ్యాంకులు తమ డ్రిఫ్టింగ్ గడియారాలను సరిదిద్దుకునేవాళ్లు.
రైల్ టైమ్ టు రైట్ టైమ్:
కొన్నేళ్ల తర్వాత GMT(గ్రీన్విచ్ మీన్ టైమ్).. దేశవ్యాప్తంగా(యూకే) టెలిగ్రామ్ ద్వారా 'రైల్వే సమయం'గా పంపిణీ చేయబడింది. 1880లలో గ్రీన్విచ్ టైమ్ సిగ్నల్ అట్లాంటిక్ మీదుగా సబ్‌మెరైన్ కేబుల్ ద్వారా మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌కు పంపబడింది.
వాషింగ్టన్ DCలో జరిగిన ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్‌లో 25కు పైగా దేశాలు GMTని అంతర్జాతీయ సమయ ప్రమాణంగా మార్చాలని నిర్ణయించాయి. దశాబ్దాలు గడిచేకొద్దీ, సమయాన్ని సమకాలీకరించడానికి మెరుగైన మార్గం అవసరమని స్పష్టమైంది. ఈ మేరకు కచ్చితమైన సమయాన్ని అందించేందుకు అన్ని గడియారాలకు ఆవర్తన, పునరావృత ప్రక్రియ(అది స్వింగింగ్ లోలకం అయినా లేదా క్వార్ట్జ్ క్రిస్టల్ ఎలక్ట్రానిక్ డోలనాలు అయినా పర్వాలేదు) అవసరం.
సూర్యుడు ఒక రోజు తర్వాత ఆకాశంలో అదే స్థానానికి చేరుకునేందుకు పట్టే సమయాన్ని ఉపయోగించి గ్రీన్విచ్లోని గడియారాలు క్రమాంకనం చేయబడ్డాయి. ఇది 1928లో GMT స్థానంలో వచ్చిన యూనివర్సల్ టైమ్‌కు కూడా వర్తిస్తుంది.
వేగం తగ్గడంతో..
ఏది ఏమైనప్పటికీ చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహాల నుంచి వచ్చే గురుత్వాకర్షణ ప్రభావాలు, కోర్, మాంటిల్‌లోని భౌగోళిక మార్పులు, సముద్ర, వాతావరణ మార్పుల కారణంగా సంవత్సరాలుగా మన గ్రహ భ్రమణంలో వేగం మందగించిందని 20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు గ్రహించారు.
ఈ మేరకు భూమి 1900లో దాని వేగాని కంటే 21వ శతాబ్దం ప్రారంభంలో దాదాపు 4 మిల్లీసెకన్లు నెమ్మదిగా తిరుగుతోంది. కాబట్టి ప్రపంచంలోని అత్యుత్తమ టైమ్ కీపర్స్ సగటు గడియారం లేదా గ్రాండ్ క్లాక్ కంటే ఎక్కువ కచ్చితత్వాన్ని క్లెయిమ్ చేయగలిగినప్పటికీ, వారు 'నిజమైన' సమయం గురించి తప్పుడు అంచనాతో ఉన్నారు.
అటామిక్ టైమ్:
అదే కాలంలో క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు.. 'ఆటమ్స్'(అణువులు) భూగ్రహ భ్రమణ కంటే చాలా మెరుగైన సమయాన్ని కలిగి ఉండవచ్చని సూచించారు. నిజానికి అణు గడియారాలు భూభ్రమణం ఆధారంగా సమయాన్ని చాలా కచ్చితంగా చూపిస్తాయి. వీటి ఆధారంగానే టైమ్ కీపర్స్ ప్రతిసారి లీప్ సెకన్లను జోడిస్తారు.
అయితే లండన్‌లోని NPL వద్ద గల 'హైడ్రోజన్ మెజర్స్' ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పరమాణు గడియారాల్లో కొన్ని. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక వందల మంది జాతీయ మెట్రాలజీ ఇన్‌స్టిట్యూట్స్‌తో అవి నిర్వహించబడుతున్నాయి.
స్థానిక గురుత్వాకర్షణ ప్రభావాలు లేదా వాటి ఎలక్ట్రానిక్స్ మధ్య తేడాల కారణంగా వీటిల్లోనూ వ్యత్యాసాలు రావచ్చు. అందువల్ల మెట్రాలజిస్టులు ఆ లోపాలను సవరిస్తారు. ఈ మేరకు హైడ్రోజన్ మేజర్స్‌లో క్లాక్ డ్రిఫ్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తే, దిద్దుబాటు చర్యలు చేస్తారు('స్టీరింగ్' అని పిలిచే ఈ ప్రక్రియలో ప్రత్యేక పరికరాలను ఉపయోగించి సవరిస్తారు).
NPL దానిని ప్యారిస్‌లోని ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్(BIPM)కి పంపుతుంది. BIPM వద్ద సమయపాలకులు ఆ కొలతలన్నింటిని సగటున సృష్టిస్తారు. మెరుగైన పనితీరు గల గడియారాలకు అదనపు వెయిట్ ఇస్తారు. సర్దుబాట్ల అనంతరం చివరికి ఇది అంతర్జాతీయ అటామిక్ టైమ్(TAI - టెంప్స్ అటామిక్ ఇంటర్నేషనల్)గా పిలవబడుతుంది.
నెలకు ఒకసారి, BIPM.. TAIని 'సర్క్యులర్-T' అని పిలిచే అత్యంత ముఖ్యమైన పత్రంలో పంపుతుంది. ఈ పత్రం జాతీయ ప్రయోగశాలలు తమ గడియారాలను మళ్లీ నడిపించేందుకు అనుమతిస్తుంది.
చాలా మందికి నానోసెకన్ వరకు సమయం తెలియాల్సిన అవసరం లేనప్పటికీ అనేక పరిశ్రమలు, సాంకేతికతలు తెలుసుకోవాలి.
ఏదేమైనా అన్ని సమయాలను స్థానికంగా నిర్వచించిన రోజులకు మనం తిరిగి వెళితే, మన సాంకేతికతలు చాలా వరకు పని చేయడం ఆగిపోతాయి. రైళ్లు క్రాష్ అవుతాయి, ఆర్థిక మార్కెట్లు కూలిపోతాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచ గడియార సమయంలో మనం ప్రయాణం చేయాల్సిందే.
0 Comments:
Post a Comment