🔳400 మంది విద్యార్థినులకు ఒకటే బాత్రూమ్
400 మంది విద్యార్థినులకు ఒకటే బాత్రూమ్రాజానగరం హైస్కూల్ వద్ద పాఠశాల కమిటీ సభ్యుల ఆందోళన
తాగడానికి నీళ్లు లేవు.. విద్యార్థులకు బాత్రూమ్స్ లేవు
రాజానగరం హైస్కూల్లో నాడు నేడూ ఇంతే
రాజానగరం, జూలై 28 : నాడు నేడు పథకంలో అన్ని పాఠశాలలు ఆధునీక రించాం.. సమస్యలున్న పాఠశాల చూపించండి..ఇదీ నాయకుల సవాల్.. ఎక్కడో మారుమూలకెందుకు.. రాజానగరంలో హైస్కూల్ చూస్తే సరి.. ఏకంగా వెయ్యి మంది విద్యార్థులు ఉన్న పాఠశాల ఇది.. ఓ వైపు జాతీయ రహదారి.. మరో వైపు ఏడీబీ రోడ్డును ఆనుకుని ప్రధాన కూడలిలో ఉన్న రాజానగరం హైస్కూల్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు వెయ్యి మంది విద్యార్ధులు ఉన్న పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 400 మంది ఆడపిల్లలకు ఒకటే బాత్ రూమ్.. దానికి కూడా నీటి సదుపాయం లేదు..దీంతో విద్యార్థినులు విరామ సమ యంలో లైన్లో వేచి ఉండాల్సిన దుస్థితి. ఇక మగ పిల్లలైతే రహదారిని దాటుకుని బయటకు రావడం ఇక్కడ పరిపాటిగా మారింది. తాగునీటి సౌకర్యం కూడా లేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఏదైనా జరగరానిది జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని కమిటీ సభ్యులు,హెచ్ఎం కామేశ్వరరావును నిల దీశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో హైస్కూల్ కమిటీ చైర్మన్ కె.రాజ్‌కుమార్, వైస్ చైర్మన్ జక్కం పూడి సూరిబాబు, సభ్యులు మాచిరెడ్డి సత్తిరాజు, యు.త్రినాఽథరావు, జి.కామేష్, కాళ్ల శేషు, బీజేపీ నాయకుడు మోది సత్తిబాబు ఆందోళన చేశారు.
0 Comments:
Post a Comment