AP Govt Schools: ఈవూరుపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రతిభ
ఇటీవల పదవ తరగతి ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇంతకు ముందు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రమే తమ విద్యాసంస్థ విద్యార్ధులు విజయదుంధుభి మోగించారంటూ పెద్ద ఎత్తున కరపత్రాలు, పోస్టర్లు వేసుకునేవారు, ప్రచారం చేసుకునే వారు.
కానీ ఇప్పుడు జగనన్న సర్కార్ బడుల్లోనూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు రాబడుతున్నారు. పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్ధులు సాధించిన ఘనతను తెలియజేస్తూ బ్రోచర్లు, కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఫణితపు జయశ్రీ అనే విద్యార్ధిని 600 మార్కులకు 590 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. మరో 18 మంది విద్యార్ధినులు 500లకు పైగా మార్కులు సాధించారు. ఈ గ్రామంలో ఎక్కువ శాతం మంది చేనేత కార్మికులే. వారి పిల్లలే పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ బడిలో చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులైయ్యారు. దీంతో నేతన్నల ఊరిలో విద్యా కిరణాలు అంటూ ప్రత్యేకంగా బ్రోచర్ వేసి తాజా అడ్మిషన్ల కోసం స్కూల్ యాజమాన్యం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రోచర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా
ఈ ప్రకటన చూసి ఇదేదో లక్షలకు లక్షలు ఫీజులు కట్టుంచుకునే నారాయణో, శ్రీ చైతన్య స్కూల్ దో కాదు. ఇది మామూలు పేద వాళ్ల పిల్లలు చదివే గవర్నమెంట్ జిల్లా పరిషత్ హైస్కూల్ కరపత్రమని పేర్కొంటున్నారు. ఇలాంటి దృశ్యాలు గతంలో ఎప్పుడూ చూడలేదు కూడా. ఉచిత ఫీజు, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, ఉచిత యూనిఫాం, ఐడి కార్డు, ఉచిత మధ్యాహ్న భోజన పథకం, ఉచిత నోట్ పుస్తకాలు, అక్స్‌ఫర్డ్ డిక్షనరీ, ఉచిత శానిటరీ కిట్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించడంతో పాటు అమ్మఒడి పథకం కింద ఏడాదికి ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తొంది. చిరుద్యోగులు, నేతన్నలు, ఇతర కార్మికులు వారి పిల్లల కోసం ఇంతకు ముందులా రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రైవేటు పాఠశాలలకు ధారపోయాల్సిన పని లేకుండా ఇన్ని ఉచిత వసతులతో మంచి విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే రోజులు వచ్చేశాయి. ఇదిగో ఈ బ్రోచర్ చూస్తున్నారుగా, వాళ్లు పిలుస్తున్నారు. వాళ్లు పిలుస్తున్నారు. మీ బాలికలను నిశ్చితంగా వాళ్ల దగ్గరకు పంపించండి.
0 Comments:
Post a Comment