White Hair Problem: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి బంగాళాదుంప రసం ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా బంగాళాదుంప రసం జుట్టు పెరుగుదలకు కూడా చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. జుట్టు సమస్యలతో పోరాడానికి సహాయపడే అనేక పోషకాలను ఆలు కలిగి ఉంటుంది.
కావున దీని రసాన్ని స్కాల్ప్‌ను శుభ్రం చేసి చుండ్రును వదిలించడానికి సహాయపడుతుంది. బంగాళదుంప రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది ఇన్ఫెక్షన్ల నుంచి స్కాల్ప్‌ను రక్షించడానికి దోహపడుతుంది. బంగాళాదుంప రసం, పెరుగు మిశ్రమాన్ని హెయిర్‌కి అప్లై చేస్తే జుట్టు బలంగా మారుతుంది.
హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలి:
బంగాళదుంప రసం, పెరుగు హెయిర్ మాస్క్ చేయడానికి.. ముందుగా ఒక పాత్రలో బంగాళదుంపల రసాన్ని తీసుకోండి.
ఇప్పుడు బంగాళదుంప రసంలో 2 నుంచి మూడు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్‌కు అప్లైచేయండి.
ఇప్పుడు బంగాళాదుంప రసం, పెరుగును పేస్ట్‌తో హెయిర్ ఫోలికల్స్, స్కాల్ప్‌కు మసాజ్ చేయండి. దీనిని జుట్టుకు ఒక గంట పాటు ఉంచండి. ఆ తర్వాత జుట్టును బాగా శుభ్రపరచాలి.
ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేస్తే.. జుట్టు దృఢంగా మారుతుంది. తెల్ల జుట్టు నల్ల జుట్టుగా తయారవుతాయి.
ఈ మాస్క్ జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది?:
బంగాళదుంపలో విటమిన్ బి, సి, జింక్, ఐరన్ ఉంటాయి. దీని ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. కావున జుట్టును బలపరిచి.. పొడి జుట్టును తొలగిస్తుంది.
0 Comments:
Post a Comment