Whatsapp : యూజర్లకు వాట్సాప్ మరో ఆఫర్.. అలా చేస్తే క్యాష్ బ్యాక్..!
Whatsapp : వాట్సప్ రోజు రోజుకు సరికొత్త ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంది. మారుతున్న కాలానుగూణంగ ప్రజలు యూపీఐ లాంటి సేవలను అధికంగా వినియోగించుకుంటున్నారు.
క్షణాల్లో డబ్బును ఒకరి నుండి మరొకరికి చేరవేసేందుకు ఇలాంటి డిజిటల్ సేవలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా జనానికి ఈ సేవలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే వీటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త యాప్స్ అభివృద్ధి చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఫలితంగా కొత్త యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా డిజిటల్ లావాదేవీలు మరింత సులభతరం అయ్యాయి.
తాజాగా వాట్సప్ మెసెంజర్ యాప్ ఒక కొత్త ఆఫర్ వినియోగదారులకు ప్రకటించింది. ఇప్పటికే వాట్సప్ యూపీఐ పేమెంట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కస్టమర్లను ఆకర్షించేందుకు గాను క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఎంపిక చేసింది. ఇందులో ఎంపిక చేసిన కష్టమర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వారికి మాత్రమే ఈ ఆఫర్ అంటూ ప్రకటించింది. వాట్సప్ పేమెంట్ ఫీచర్ ద్వారా ఇతరులకు పేమెంట్ చేస్తే మొదటి మూడు లావాదేవీలకు గాను రూ.35 చొప్పున, రూ.105 డబ్బును క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఒక్క రూపాయి నుండి ఎంత పేమెంట్ చేసినా రూ.35 క్యాష్ బ్యాక్ అందిస్తుంది వాట్సప్. డిజిటల్ లావాదేవీలు అత్యధికంగా వాట్సప్ ద్వారానే చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే వాట్సప్ ఈ యాప్ తీసుకొచ్చింది. ఈ తక్కువ కాలం ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కష్టమర్లకు మాత్రమేనని వాట్సప్ ప్రకటించింది.
ఇందుకోసం కస్టమర్లు యూపీఐ పేమెంట్స్ యాక్టివేట్ చేసుకోవాలి. వాట్సప్ పెమెంట్స్ సెక్షన్ లోకి వెళ్లి మీ బ్యాంక్ వివరాలు నమోదుచేసుకోవాలి. అనంతరం మీరు ఎవరికైతే డబ్బులు పంపాలో ఆ యూజర్ కాంటాక్ట్ ను ఓపెన్ చేసి ఎంత అమౌంట్ పంపాలో అంత టైప్ చేసి యూపీఐ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ వారికి వెళుతుంది.
వెళ్లిన అనంతరం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇలా మూడు సార్లు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం వుంది. ఇందుకు ఇప్పటికే చాలా మంది ఈ ఆఫర్లను వినియోగించుకుని క్యాష్ బ్యాక్ పొందాలని సిద్ధంగా వున్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వాలు ప్రోత్సహించడంతో ప్రజలు అధిక సంఖ్యలో వాట్సప్ ప్రకటించిన ఆఫర్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇలాంటి ఆఫర్లు ఉండేవి కావు. ప్రజల అబీష్టం పెరిగేకొద్ది కొత్త ఆఫర్లు, రకరకాల కొత్త యాప్స్ వచ్చి జనాన్ని కవ్విస్తున్నాయి. గతంలో అమౌంట్ ఒకరి నుండి ఇంకొకరికి షేర్ చేయాలంటే బ్యాంక్ లో క్యూ కట్టి రోజులకు తరబడి వేచిచూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఇలాంటి యాప్స్ రావడం వల్ల సమయం, డబ్బు అన్ని వృధా కాకుండా పనులు జరిగిపోతున్నాయి. అంతేకాదు ఈ ఆఫర్లను వినియోగించుకోవడం వల్ల వచ్చే లాభాల గురించి ప్రత్యేకంగా యాడ్స్ రావడం కూడ విశేషం.
0 Comments:
Post a Comment