What to Offer : దేవుళ్లు.. వారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో తెలుసా?
What to Offer : మనం ఏ దేవుడి (God) కి ఏ నైవేధ్యం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాం. చాలా మంది తమ ఇష్టమైన దేవుళ్లకు ఏ ఆహారం పెట్టాలో వాటిని సమర్పించడానికే సుముఖంగా ఉంటారు.
ప్రతిరోజూ ఇంటి దేవతలను పూజించడానికి ఇష్టపడతారు. వారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. అప్పుడు వారి ప్రథమ ఎంపిక లడ్డూ లేదా పాయసం (Kheer). అయితే, ఈ ప్రసాదాలు అందరు దేవుళ్లకు నచ్చవు.
ఏ దేవుడికి ఏ నైవేధ్యం పెట్టాలో తెలుసుకుందాం.
విష్ణువు..
విష్ణువుకు పసుపు రంగులో ఉండే నైవేధ్యం పెడతారు. తేనె, అరటిపండ్లు వంటివి పెడతారు. అంతేకాదు విష్ణువు 56 రకాల నైవేధ్యలతో పూజిస్తారు.
శివుడు..
శాస్త్రాల ప్రకారం పరమశివుడు కంద ఫలాన్ని ఇష్టపడతాడు. తెల్లని స్వీట్లు, పాలు, ధాతుర వంటికి కూడా శివయ్యకు ఇష్టం.
శని..
శనిదేవుడి ఆగ్రహం గురించి మనందరికీ తెలుసు. ఈయన ముఖ్యంగా నలుపును ఇష్టపడతాడు. అతనికి ఇష్టమైన నైవేధ్యం బెల్లంతో చేసిన నల్లనువ్వులు. శనిదేవుడి తల్లి ఛాయదేవి గర్భం దాల్చిన సమయంలో తీవ్ర తపస్సు చేసి, రోజుప తరబడి నీరు, ఆహారం లేకుండా మండే ఎండలో తపస్సు చేసిందని చెబుతారు. శనిదేవుడు తన తల్లి తపస్సు కారణంగా గొప్ప శక్తులను వారసత్వంగా పొందాడు.
సరస్వతీ దేవి..
సరస్వతీ దేవి జ్ఞానం ,సరళత దేవత. ఆమె తాజా పండ్లను ఇష్టపడుతుంది. ముఖ్యంగా మిశ్రికండ్ ఇష్టపడుతుంది. ఆమెకు అన్నం లేదా అటుకులు, పెరుగన్నం చాలా దేవతలకు ఇష్టమైనదిగా చెప్పబడే ఖిచ్డీ కూడా ఇష్టం. సరస్వతీ దేవి ఆరాధన సమయంలో ఆమెకు బూందీ కూడా పెడతారు.
దుర్గమాత..
దుర్గామాతకు పూజా సమయంలో పెసరపప్పుతో చేసిన కిచిడీ, పాయసం కూడా సమర్పిస్తారు.
లక్ష్మీదేవి..
కీర్తి, శ్రేయస్సును ఇచ్చే దేవత. పాయసం, లడ్డూ పెడతారు. పురాణాల ప్రకారం కొబ్బరి లడ్డూ, హల్వా కూడా ఇష్టం
శ్రీ కృష్ణ..
కృష్ణుడికి ఇష్టమైన నైవేధ్యం ఏంటో మీకు తెలుసా? అవును, శ్రీ కృష్ణ భగవానుడికి వెన్న పాలు, మిస్రి, లడ్డూ అంటే చాలా ఇష్టం.
ఇది కూడా చదవండి: కర్కాటక రాశివారు ఈ రత్నాన్ని ధరిస్తే దురదృష్టం అదృష్టంగా మారిపోతుందట..
కాళీ దేవత..
కాళీ మాతకు బియ్యంతో చేసిన వంటకాలను ఇష్టపడుతుందని నమ్ముతారు. ఆమెకు ఎక్కువగా కిచ్డీ, ఖీర్ ఇస్తారు.
హనుమంతుడు..
హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని ఆస్వాదిస్తాడు మసూర్ పప్పు, బెల్లం, దానిమ్మ ,మోతీచూర్ లడ్డూను ఇష్టపడతాడు.
గణేశుడు..
గణేశుడికి ఇష్టమైన నైవేధ్యం మనందరికీ తెలుసు. ఆయనకు మోదకం, లడ్డూ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు.
0 Comments:
Post a Comment