Weight Loss Tips: భారతీయుల వంటగదిలో చాలా రకాల ఆయుర్వేద మూలికలుంటాయి. కానీ వాటి విలువ చాలా మందికి తెలియదు. కిచెన్లో ఉండే ఉప్పు, పంచదార, అల్లం, నిమ్మకాయలు శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతాయి.
అంతేకాకుండా వీటిని హౌస్ ఆఫ్ మెడిసిన్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా అల్లం వంటి శరీరానికి మేలు చేసే ఔషదగుణాలు కలిగిన వాటిని నిత్యం వినియోగిస్తారు. అంతేకాకుండా దీనిని ఉదయాన్నే తాగే టీలో కూడా వాడతారు.
ఇది టీ రుచిని పెంచడమే కాకుండా శరీరంలో అన్ని భాగాలకు మేలు చేస్తుంది. అలాగే ఇది స్థూలకాయాన్ని తగ్గించడానికి దోహదపడి.. జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇది దగ్గు, జలుబు మొదలైన సమస్యలపై ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో విటమిన్లు, జింక్, ఐరన్, కాల్షియం మొదలైన అనేక పోషక మూలకాలు ఉన్నాయి.
ఇది బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది గ్యాస్, కఫం ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి అల్లం, ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఉదర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
అల్లం, ఉప్పు కలిపి తీసుకుంటే పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గ్యాస్ సమస్యను దూరం చేయడంతో పాటు పొట్టలో వచ్చే రాళ్ల సమస్య, ఛాతీ నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
బరువును తగ్గిస్తుంది:
మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందానికి అల్లం-ఉప్పు మిశ్రమం ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.
అంతేకాకుండా శరీరంలో జీవక్రియను మెరుగు పరిచి బరువును తగ్గిస్తుంది.
వృద్ధాప్య విముక్తి:
అల్లంలో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి విష పదార్థాలను తొలగిస్తుంది. శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేస్తుంది.
0 Comments:
Post a Comment