Weather Update: రుతుపవనాల రాకలో ఆలస్యం లేదు- 2 రోజుల్లో ఇక దంచుడే దంచుడు: IMD
Weather Update: నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు సాధారణంగానే పయనిస్తున్నాయని, రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రను తాకుతాయని ఐఎండీ పేర్కొంది.
మే 31- జూన్ 7 మధ్య దక్షిణ, మధ్య అరేబియా మహాసముద్రం, కేరళ సహా కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది.
" రుతుపవనాల రాకలో ఎలాంటి ఆలస్యం లేదు. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశిస్తాయి. తర్వాత రెండు రోజుల్లో ముంబయిలోనూ వర్షాలు పడొచ్చు. ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురుస్తాయి. గోవా, మహారాష్ట్రల్లోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి కనిపిస్తుంది. " -ఐఎండీ
0 Comments:
Post a Comment