Vitamin D Rich Foods: శరీరానికి విటమిన్ డి కావాలంటే కొంత సమయం ఉదయం పూట ఎండలో గడపాలని మనలో చాలా మందికి తెలుసు. అయితే కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా ఈ పోషకం లభిస్తుందని చాలా మందికి తెలియదు..!
ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది శరీరంలో కొరతగా ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
అయితే శరీరంలో దీని కోరత లేకుండా చూసుకోవడానికి పలు రకాల ఆహార పదార్థాలు తీసకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అంశంపై ప్రముఖ పోషకాహార నిపుణుడు 'నిఖిల్ వాట్స్' ఏమన్నారో తెలుసుకుందాం.
విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదాలు:
1. అధిక రక్తపోటు:
గుండె, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విటమిన్ డి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
2. దీర్ఘకాలిక నొప్పి:
మన శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. దీర్ఘకాలిక పొట్ట సమస్యల వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3. బలహీనమైన కండరాలు:
శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. కండరాల బలహీనత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
4. పగటిపూట అలసట, నిద్రపోవడం:
కొంతమంది ఆఫీసులో లేదా రోజులో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోవడం లేదా అనవసరంగా నిద్రపోవడం చేస్తూ ఉంటారు. తరచుగా ఇలా చేస్తే.. శరీరంలో విటమిన్ డి కోరతని నిపుణులు తెలుపుతున్నారు.
5. డిప్రెషన్:
డిప్రెషన్ కూడా విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. అంతేకాకుండా ఇది సామాజిక, ఆర్థిక కారణాల వల్ల వచ్చే అవకాశాలున్నాయి.
6. సహనం కోల్పోవడం:
శరీరంలో విటమిన్ డి పుష్కలంగా ఉన్నవారు ఇతరులకన్నా ఎక్కువ సహనం కలిగి ఉంటారు. చాలా మంది అథ్లెట్లకు ఈ పోషకం లేకపోవడం వల్ల చిన్నపాటి సమస్యను కూడా భరించలేకపోతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.
7. చెడు మానసిక స్థితి:
మానసిక స్థితి సాధారణం కంటే అధ్వాన్నంగా ఉంటే.. దాని వెనుక విటమిన్ డి లోపం వంటి సమస్యలే కారణమని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి పోషకాలు కలిగి ఉన్న కొన్ని ఆహారాలను తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వీటి వల్ల విటమిన్ డి లభ్యమవుతుంది:
- చేపలు
- చేపల గుడ్లు
- పుట్టగొడుగు
- పాలు
- ధాన్యం
- కోడి గుడ్లు
0 Comments:
Post a Comment