UPI Transactions: మొబైల్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? మీ బ్యాంక్ డైలీ లిమిట్ ఎంతో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం కోసం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ట్రాన్సాక్షన్ మెథడ్‌ను తీసుకొచ్చింది.
ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన లావాదేవీ పద్ధతుల్లో ఇది ఒకటిగా నిలిచింది. UPI ద్వారా ఆర్థిక లావాదేవీలను చాలా సులభంగా చేయవచ్చు. నిమిషాల్లో డబ్బును అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
దీంతో ఇది జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి స్మార్ట్‌ఫోన్ ద్వారా UPI ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు చేయవచ్చని తెలిసిందే.
యూపీఐ(UPI) అంటే: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను RBI నియంత్రిత సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. ఇది ఒక ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్.
UPI అనేది IMPS ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రూపొందించారు. దీని ద్వారా ఇద్దరు వ్యక్తుల బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణమే డబ్బును బదిలీ చేసుకోవచ్చు.
యూపీఐ అనేది మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్‌ను ఒకే మొబైల్ అప్లికేషన్‌గా ఆర్థిక లావాదేవీలను శక్తివంతం చేసే వ్యవస్థ. NPCI ప్రకారం.. "పీర్ టు పీర్" కలెక్ట్ రిక్వెస్ట్‌ను కూడా అందిస్తుంది.
ఈ పద్ధతి ద్వారా డబ్బును బదిలీ చేయడానికి వినియోగదారులు BHIM UPI యాప్, వారి బ్యాంకుల మొబైల్ యాప్‌లే కాకుండా ఫోన్‌పే, పేటియం, గూగుల్ పే వంటి విభిన్న పేమెంట్ యాప్స్ కూడా ఉపయోగించవచ్చు.
UPI లావాదేవీ పరిమితులు : UPI అనేది వేగంగా, అత్యంత సులభంగా యాక్సెస్ చేయగల పేమెంట్ మెథడ్స్‌లో ఒకటి. అయితే ప్రతిరోజూ అంతులేని లావాదేవీలను చేయడానికి అవకాశం ఉండదు.
ఆర్బీఐ, ఎన్పీసీఐ సంస్థలు యూపీఐ రోజువారీ లావాదేవీలపై పరిమితిని విధించాయి. ఒక్కో వినియోగదారుడు ఒక రోజుకు రూ.2 లక్షల వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతి ఇచ్చాయి.
అయితే వివిధ బ్యాంకులు వేర్వేరుగా లావాదేవీలపై పరిమితులను విధించాయి. వివిధ బ్యాంకుల్లో అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
ఎస్బీఐ : భారతదేశం అతిపెద్ద రుణదాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. UPI ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.1 లక్షగా నిర్ణయించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ : UPI ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఈ బ్యాంకు ఒక రోజుకు రూ.1 లక్షగా నిర్ణయించింది. కొత్త వినియోగదారుల కోసం, మొదటి 24 గంటలపాటు లావాదేవీ పరిమితిని రూ. 5,000గా నిర్ణయించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా : UPI ట్రాన్సాక్షన్ లిమిట్‌ను BOI ఒక్కో వినియోగదారుకు రూ.1 లక్షగా నిర్ణయించింది. అలాగే రోజువారీ UPI పరిమితిని కూడా రూ.1 లక్షగా నిర్ణయించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ : PNB UPI ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 25,000 కాగా, రోజువారీ UPI పరిమితి రూ. 50,000గా నిర్ణయించింది.
యాక్సిస్ బ్యాంక్ : యాక్సిస్ UPI లావాదేవీపై ఒక్కో యూజర్‌కు రూ. 1 లక్ష వరకు పరిమితి ఉంటుంది. అలాగే రోజువారీ UPI పరిమితి కూడా అంతే మొత్తంగా నిర్ణయించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ : ICICI UPI లావాదేవీ పరిమితి రూ.10,000గా ఉంది. అలాగే రోజువారీ UPI పరిమితి కూడా రూ.10,000గా నిర్ణయించింది.
అయితే, Google Pay వినియోగదారుల కోసం ICICI బ్యాంక్ ఈ రెండు పరిమితులను ప్రతి వినియోగదారుల కోసం రూ. 25,000గా నిర్ణయించింది.
0 Comments:
Post a Comment