Tulsi Tea Benefits: తులసిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, తులసి టీ తాగడం వల్ల కూడా చాలా అన్నే లభాలున్నాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది.
వాస్తవానికి ఇందులో యాంటీవైరస్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుంచి దూరంగా ఉంచుంది.
ఈ సమస్యల నుంచి ఉపశమనం:
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి తులసి టీ చాలా మేలు చేస్తుంది. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా ప్రజలు కలుష్యపు ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తులసి టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీ వల్ల మల విసర్జన ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా గ్యాస్ సమస్య, విరేచనాలు, కడుపులో తిమ్మిర్లు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
మంచి నిద్ర కోసం తులసి టీ తప్పకుండా తాగండి:
మంచి నిద్ర కోసం తులసి టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఒత్తిడి, నూతన జీవనశైలి కారణంగా ప్రజలు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు.
అటువంటి పరిస్థితిలో మంచి నిద్ర కోసం తులసి టీ తాగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
0 Comments:
Post a Comment