Trees - మనిషి కోసం మొక్కలు తీసుకునే 'రహస్య నిర్ణయాలు', కొత్త స్టడీలో షాకింగ్ సంగతి!
భూమి ఉద్భవించిందే ఒక భయానక విస్ఫోటనంతో అని సైన్స్ స్పష్టంగా చెబుతుంది. తర్వాత ఈ గ్రహంపై డైనోసార్ల వంటి జీవులు ఉండటం, మరోసారి భూమిపై ఉపద్రవం..
ఇలా, ఇక్కడ ప్రకృతి తనను తాను తిరిగి పురుడుపోసుకొని, కొత్త జన్మగా ఉద్భవిస్తూనే ఉండటం శాస్త్రీయ సత్యంగా మారింది. అయితే, ప్రస్తుతం కాలుష్యం కారణంగా భూమి అగ్ని గోళంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ చెట్లు నరికేస్తుంటే, కార్భన్‌డైఆక్సైడ్ మాత్రమే మిగిలుతుందని అనిపిస్తుంది. ఈ తరుణంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుండి ఒక అధ్యయనం గతంలో తెలియని ప్రకృతి ప్రక్రియను వెల్లడించింది. మొక్కలు వాతావరణంలోకి ఎంత కార్బన్‌ను తిరిగి విడుదల చేయవచ్చనే దానిపై "రహస్య నిర్ణయాలు" తీసుకోగలవని చెప్పారు.
నేచర్ ప్లాంట్స్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో మొక్కలు పర్యావరణానికి సహాయం చేస్తూనే, ప్రపంచ ఆహార అవసరాలను తీర్చడానికి భవిష్యత్తులో కొత్తగా రూపొందుతాయని పేర్కొన్నారు. "మనం ఊహించని విధంగా మొక్కలు తమ శ్వాసక్రియను నియంత్రిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవపదార్ధాలను నిర్మించడానికి అవి ఎంత కార్బన్‌ను నియంత్రించాలో దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటాయి" అని అధ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్లాంట్ బయోకెమిస్ట్ హార్వే మిల్లర్, సైన్స్ అలర్ట్‌కి చెప్పారు. కార్బన్‌డైఆక్సైడ్ (CO2)ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేయడానికి పైరువేట్ అనే సమ్మేళనాన్ని కాల్చాలని నిర్ణయించుకునే ముందు ఈ ప్రక్రియ జరుగుతుందని, థాలే క్రెస్ (అరబిడోప్సిస్ థాలియానా) అనే క్లాసిక్ ప్లాంట్ మోడల్ జీవిపై పనిచేస్తున్నప్పుడు ఈ విషయం అర్థమయ్యిందని ఆయన అన్నారు. ఇక, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఈ సామర్థ్యం బయోకెమిస్ట్రీలో ఇప్పటి వరకూ ఉన్న సాధారణ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లేనని ఈ అధ్యయనం సూచిస్తుంది.
0 Comments:
Post a Comment