Top-Selling Neckbands: భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఇవే..!
నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్(Earphone).. ప్రస్తుతం ప్రతి స్మార్ట్ ఫోన్(Smartphone) యూజర్‌కి(Users) అతి ముఖ్యమైన యాక్సెసెరీగా మారిపోయింది. రకరకాల డిజైన్స్(Designs), బడ్జెట్(Budget) ధరల్లో డిఫరెంట్ ఫీచర్స్(Features), స్టైలిష్ లుక్‌తో యూజర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముడవుతున్న టాప్ బ్రాండ్స్(Top Brands) నెక్‌బ్యాండ్‌లను పరిశీలిద్దాం.
* వన్‌ఫ్లస్ బులెట్స్ వైర్‌లెస్ Z బాస్ ఎడిషన్
ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను 9.2mm డ్రైవర్ యూనిట్‌తో రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు ర్యాప్ ఛార్జ్ సపోర్ట్‌తో పాటు చెమట, విటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఇందులో స్పోర్ట్ మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లు ఉంటాయి. ప్రస్తుతం దీని ధర రూ. 1999
* బోట్ రాకర్జ్255 ప్రో ఫ్లస్
ఈ ఇయర్ ఫోన్లను వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో తయారు చేశారు. ఇవి డ్యూయల్ పెయిరింగ్ ఫంక్షనాలిటీని అందిస్తాయి. అంటే వీటితో ఒకేసారి రెండు డివైజ్‌లను కనెక్ట్ చేయవచ్చు. ఇది మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌ని అందజేస్తుంది. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందజేస్తాయి. దీని ధర రూ.1499.
* జీబ్రానిక్ జబ్-లార్క్
ఈ నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు డ్యూయల్ పెయిరింగ్ ఫంక్షనాలిటీని అందిస్తాయి. సరసమైన ఇయర్‌ఫోన్‌లో మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లను అమర్చారు. స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్ తో వీటిని తయారు చేశారు. బ్లూటూత్ వెర్షన్ 5.0కి ఇది సపోర్ట్ చేస్తుంది. 17 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. దీని ధర రూ. 749 మాత్రమే.
* రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో
ఈ నెక్‌బ్యాండ్‌ను 11.2mm బాస్ బూస్ట్ డ్రైవర్‌తో రూపొందించారు. అడ్వాన్స్ బాస్ బూస్ట్ + (BB+) అడిషనల్ ఫీచర్‌తో ఇది రిచ్‌లుక్‌గా కనిపిస్తుంది. అలాగే 88ms సూపర్-లో లేటెన్సీ ఫీచర్ కూడా ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 17 గంటల బ్యాటరీ లైఫ్ అందజేస్తుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. 10 నిమిషాల ఛార్జ్‌తో 120 నిమిషాల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని ఆస్వాదించవచ్చు. దీని ధర రూ. 1499.
* Zebronics Zeb-Symphony
ఈ నెక్‌బ్యాండ్ ఫ్లెక్సీబుల్‌గా ఉంటుంది. వీటిని వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో రూపొందించారు. ఈ నెక్‌బ్యాండ్ కుడి వైపు అన్నింటిని నియంత్రిస్తుంది. మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లు చిక్కుకోకుండా ఇది నిరోధిస్తుంది. ఒకే ఛార్జ్‌పై 13 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందజేస్తాయి. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2.5 గంటలు పడుతుంది. దీని ధర రూ. 740.
Jio Offer: గుడ్ న్యూస్... ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.7,200 విలువైన బెనిఫిట్స్
* రెడ్‌మీ సోనిక్‌బాస్
చైనా కంపెనీ షావోమీ నుండి వచ్చిన బడ్జెట్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ రెడ్‌మీ సోనిక్‌బాస్. ఇది12 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో వస్తుంది. IPX4 చెమట, వాటర్ రెసిస్టెన్స్‌తో ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఇది బ్లూటూత్ 5.0 ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్‌లు రెండింటితో పని చేస్తుంది. వాయిస్ కమాండ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్లాట్ నెక్‌బ్యాండ్ కేబుల్ డిజైన్‌తో ప్రస్తుతం ధర రూ. 1270కు అందుబాటులో ఉన్నాయి.
0 Comments:
Post a Comment