Tippateega మధుమేహం ఉన్నవారికి తిప్పతీగ ఆరోగ్యానికి వరం.. ఎలానో తెలుసుకోండి!
తిప్పతీగను (Thippathiga) గిలోయ్, అమృత వల్లి అనే పేర్లతో పిలుస్తారు. తిప్పతీగలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
ఇవి ఆరోగ్యానికి సర్వరోగ నివారిణిగా సహాయపడతాయి. ఈ తీగను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుంటే తినకుండా ఉండలేరు. మరి ఆరోగ్యం కోసం తిప్పతీగను ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదర ఆరోగ్యం బాగుంటుంది: అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంతో కలిపి తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీంతో జీర్ణవ్యవస్థ (Digestive system) పనితీరు మెరుగుపడి ఉదర ఆరోగ్యం (Abdominal health) బాగుంటుంది.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది: ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారికి తిప్పతీగ చక్కటి పరిష్కారం. ప్రతిరోజూ తిప్పతీగ చూర్ణాన్ని తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దీంతో మెదడు పనితీరు (Brain function) మెరుగుపడి జ్ఞాపకశక్తి (Memory) కూడా పెరుగుతుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి: కీళ్ల నొప్పుల (Arthritis) నుంచి ఉపశమనం కోసం తిప్పతీగను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, కొద్దిగా అల్లం రసంను (Ginger juice) కలిపి రెండు పూటలా తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గి కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: శరీరంలోని అనేక వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేసే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కనుక ప్రతిరోజూ తిప్పతీగ చూర్ణాన్ని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు (Illness problems) దూరంగా ఉంచుతుంది.
డయాబెటిస్ ను నియంత్రిస్తుంది: తిప్పతీగలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను (Glucose levels) తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే డయాబెటిస్ (Diabetes) నియంత్రణలో ఉంటుంది.
కామెర్లు నయమవుతాయి: పదిహేను తిప్పతీగ ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొన్న మిశ్రమాన్ని మజ్జిగలో (Buttermilk) కలిపి ఫిల్టర్ చేసి ఉదయాన్నే తాగితే కామెర్లు నయమవుతాయి. కనుక కామెర్లతో (Jaundice) బాధపడేవారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మూత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి: మూత్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు 10-20 మి.లీ తిప్పతీగ రసంలో రెండు గ్రాముల రాతి భేద పొడి, ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకుంటే మూత్ర సంబంధిత సమస్యలు (Urinary problems) తగ్గుతాయి. దీంతో మూత్రాశయ ఆరోగ్యం (Bladder health) మెరుగుపడుతుంది .
కుష్టు వ్యాధిని నయం చేస్తుంది: 10-20మి.లీ తిప్పతీగ రసాన్ని రోజుకు రెండు సార్లు క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు తీసుకుంటే కుష్టు వ్యాధి (Leprosy) నయమవుతుంది. అలాగే చర్మ సంబంధిత అనేక సమస్యలు (Skin problems) తగ్గుతాయి. దీంతో చర్మ ఆరోగ్యం కూడ మెరుగుపడుతుంది.
0 Comments:
Post a Comment