Sun Line: అరచేతిలో ఈ రేఖ ఉందా.. అయితే భవిష్యత్తులో తప్పక కోటీశ్వరులు అవ్వడం పక్కా..
Sun Line: చాలామంది హస్త సాముద్రికాన్ని (Palmistry) నమ్ముతారు. ఇటీవల హీరో ప్రభాస్ (Hero Prabhas) నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా తరువాత..
హస్త సాముద్రికాన్నీ నమ్మేవారి సంఖ్య పెరిగింది కూడా.. అయితే మన అరచేతిలో ఉండే రేఖలను బట్టే మన జాతకం ఏంటి.. ఎలాంటి ఫలాలు ఉంటాయని చాలామంది చెప్పేస్తుంటారు.. చేయి పట్టుకుంటే చాలు.. భవిష్యత్తును కళ్లకు కటిస్తారు. చెబు ఫలితాలైనా.. మంచి ఫలితాలను ఇట్టే చెప్పేస్తారు. భవిష్యత్తును లెక్కకట్టి మరీ చూపిస్తారు. అయితే అరచేతిలో ఎన్ని రేఖలు ఉన్నా.. సూర్య రేఖకు ప్రత్యేక స్థానం ఉంది అని నమ్ముతారు.. ఎందుకంటే హస్తసాముద్రికంలో సూర్య రేఖ (Sun Line) చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అరచేతిలో ఈ రేఖ ఎవరైతే కలిగి ఉంటారో..? అలాంటి వారి జీవితంతో ఎక్కువ సుఖ సంతోషాలు అనుభవిస్తారని శాస్త్రం చెబుతోంది. ఈ రేఖ అరచేతిలోని ఏదైనా భాగం నుండి ప్రారంభమవుతుంది.. అలాగే చేతి చిటికెన వేలు కింద ఉన్న సూర్యుని పర్వతం వరకు వెళుతుంది. ఈ రేఖ స్పష్టంగా ఉంటే అది చాలా శుభప్రదం. అదే సమయంలో, ఈ రేఖ విడదీయడం కూడా జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. అరచేతిలో సూర్య రేఖ (Sun Line in Palm) ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సూర్యరేఖ ప్రభావం
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, వ్యక్తి చేతిలో సూర్యరేఖ చాలా చిన్నగా.. అది కూడా అస్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి తన జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది అంటున్నారు. అలాగే చిన్నచిన్న విజయాల కోసం కూడా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. సూర్యుని రేఖ పొడవు నేరుగా స్పష్టంగా ఉండటం... జీవితంలో వ్యక్తికి బలమైన కీర్తిని.. విజయాన్ని అందిస్తుంది అంటారు. అలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఆనందాలను పొందే అవకాశం ఉంది అంటున్నారు. అలాంటి వారికి పాపులారిటీ కూడా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. అలాంటి వారు ఏ పని మీద చేయి వేసినా విజయం సాధిస్తారు.
సూర్యరేఖపై ఉన్న ద్వీపం లా ఉంటే.. ఏదైనా పనిలో ఉన్న వ్యక్తికి గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది అంటున్నారు. అలాంటి వ్యక్తులు వ్యాపారవేత్తలైతే, వారు దివాలా తీసే అవకాశం ఉంది అంటున్నారు. సూర్యరేఖ మధ్యలో కత్తిరించబడితే, వ్యక్తి ఉద్యోగం లేదా వ్యాపార ప్రాంతం మారుతుంది. అతను తన జీవితంలో ఒకటి కంటే ఎక్కువ రంగాలలో పని చేస్తాడంటున్నారు.
సూర్యరేఖపై నక్షత్రం గుర్తు ఉంటే, ఆ వ్యక్తి టాప్ క్లాస్ ఆర్టిస్ట్‌గా మారి తన కళ ద్వారా దేశంలోనూ.. ప్రపంచంలోనూ పేరు సంపాదించుకునే అవకాశం ఉంది అంటారు. దీంతో పాటు, అతను అపారమైన సంపద, వైభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.
0 Comments:
Post a Comment