“అడపాదడపా ఉపవాసం గతంలో గాయం మరమ్మతు, కొత్త న్యూరాన్ల పెరుగుదలకు సంబంధించిన అంశాలను ఇతర అధ్యయనాల ద్వారా తెలుసుకున్నాం. -అయితే ఉపవాసం అనేది దెబ్బతిన్న నరాలను నయం చేయడంలో ఎలా సహాయపడుతుందో వివరించడానికి మా అధ్యయనం మొదటిది అవుతుంది” అని జియోవన్నీ తెలిపారు.
తాము చేసిన అధ్యయనంతో ఎలుకలలో నరాల పునరుత్పత్తిని అంచనా వేయగలిగామని, ఇక్కడ తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాలు, వెన్నెముక నుండి కాలు కిందికి నడిచే పొడవైన నరం నలిగింది.
సగం ఎలుకలు అడపాదడపా ఉపవాసానికి లోనయ్యాయి.. (ప్రత్యామ్నాయ రోజులలో అస్సలు తినకుండా వాటికి నచ్చినంత తినడం ద్వారా).. మిగిలిన సగం ఎలుకలు ఎటువంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా తిన్నాయి.
ఇట్లా ఆహారం ఇవ్వడం అనేది వాటి ఆపరేషన్‌కు ముందు 10 నుంచి 30రోజుల పాటు కొనసాగింది. నాడి తెగిపోయిన 24 నుండి 72 గంటల తర్వాత ఎలుకల కోలుకోవడం మేము గమనించాము అని గియోవన్నీ తెలిపారు.
అయితే.. మానవులలో కూడా ఉపవాసం తర్వాత IPA పెరుగుతుందా? IPA యొక్క సమర్థత, చికిత్సకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు, పరిశోధనలు చేయాల్సి ఉంది.
మేము పూర్తిగా అన్వేషించని వాటిలో ఒకటి ఏంటంటే.. IPA రక్తంలో 4 నుండి 6 గంటల వరకు అధిక సాంద్రతలో ఉంటుంది.. కాబట్టి, దానిని రోజంతా సాధారణ ఆహారంలో చేర్చడం వలన దాని గరిష్ట స్థాయి ఎట్లుంటుంది.
ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మానవులలో నరాల బలహీనతను పోగొట్టేందుకు ఎట్లా సహాయపడుతుంది? అనే అంశాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది అని గియోవన్నీ పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment