Soap: సాధారణంగా సబ్బును వాడిన తరువాత ఆఖర్లో చిన్న ముక్క మిలుగుతుంది.. ఆ ముక్కను మనం అలాగే వదిలేస్తూ ఉంటాం.. కానీ ఆ సబ్బు ముక్కతో ఇలా సబ్బు తయారు చేసుకుని వాడితే ..
చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.. ఇంతకీ ఆ సబ్బును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
Soap Pieces Making Soap Naturally For bright Skin
ఈ సబ్బు తయారీ కోసం కమలా పండు తొక్కలు, రెండు నిమ్మకాయలు అవసరం. కమలా పండు తొక్కలను సన్నగా తరగాలి. అలాగే నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. సబ్బు ముక్కలను తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి కమలా పండు తొక్కలు, నిమ్మకాయ ముక్కలు ఆ నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఆ నీటిలో సన్నగా తరిగిన సబ్బు తురుమును వేసి ఆ సబ్బు కరిగేలా 2 నిమిషాల పాటు మరిగించాలి. ఇక ఆఖరుగా అందులో బాదం నూనె లేదంటే కొబ్బరి నూనె అర కప్పు పోయాలి..
Soap Pieces Making Soap Naturally For bright Skin
ఈ మిశ్రమం చిన్న చిన్న కప్పులలోకి పోసుకోవాలి. అంతే ఆరిన దాకా ఉంటే సబ్బు రెడీ అవుతుంది. ఈ సబ్బుతో కనుక రోజు స్నానం చేస్తే చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. వరుసగా వారం రోజుల పాటు ఈ సబ్బు వాడితే మేని ఛాయ రెట్టింపు అవుతుంది.
0 Comments:
Post a Comment