ఆరోగ్యంగా ఉండాలంటే…మంచి ఆహారంతోపాటు మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతిక టెక్నాలజీ కారణంగా నిద్రపోయే వేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
అర్థరాత్రి వరకు మేల్కోవడం, పొద్దెక్కినా నిద్రలేవలేకపోవడం ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ అయ్యింది. ఫ్యాషన్ పక్కన పెడితే…రకరకాల రోగాలు చుట్టుముట్టడం ఖాయం.
పిల్లల నుంచి పెద్దల వరకు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యను తేలిగ్గా తీసిపారేయకూడదంటున్నారు నిపుణులు.
దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, డిప్రెషన్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.
ఏదొక పనిచేయడం, ఫోన్లలో మునిగిపోవడం, టీవీ చూడటం వంటి కారణాల వల్లే పడుకునే సమయం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఎన్నో రోగాలు వస్తున్నాయి.
సరైన సమయానికి నిద్రపోయేవారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి రోజుకు ఆరు నుంచి తొమ్మిది గంటల నిద్ర కచ్చితంగా అవసరం.
రోజులో ఎక్కువ సమయం మేల్కోనిఉంటే…ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ కారణాల వల్ల రోజు వారి పనులను సక్రమంగా చేసుకోలేరు. రక్త ప్రసరణ తగ్గుతుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సమాయానికి నిద్రపోతే ఒత్తిడి పెరిగి పూర్తిగా నిరాశలో కూరుకుపోతారు.
అంతేకాదు ఊబకాయం సమస్య కూడా తలెత్తుతుంది. సరైన సమయానికి నిద్రపోతే ఒత్తిడి, నిరాశ వంటివి దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
మెమోరీ పవర్ పెరుగుతుంది. మెదడుపై ఒత్తిడి తగ్గి, మెరుగైన ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అర్థరాత్రులు మేల్కొని ఉండకుండా…సరైన సమాయాన్ని పాటిస్తూ…తగిన నిద్రపోతే…ఆరోగ్యానికి మంచింది.
0 Comments:
Post a Comment