ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గేందుకు రకరకాలు డైట్స్ పాటిస్తున్నారు.
ఇందులో భాగంగా ఒకపూట మాత్రమే భోజనం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. రాత్రి ఏమీ తినకుండా ఉపవాసం ఉంటున్నారు.
రాత్రిపూట భోజనం స్కిప్ చేసి..మరుసటి రోజు అల్పాహారం తింటున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట భోజనం మానేస్తే ఏమౌతుంది..?
రాత్రిపూట భోజనం మానేస్తే…నిద్రపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా రాత్రిపూట తినడం మానేస్తే..ఎన్నో ఆరోగ్య సమస్యలు ముడిపడి ఉన్న నిద్రకు భంగం వాటిల్లుతుంది.
నిద్ర అనేది తగ్గిపోతుంది. దీంతో నిద్రలేమికి దారితీస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు, అవసరమైన కేలరీలు అందవు.
అందుకే నిద్రను నియంత్రించే హార్మోన్లు సెరోటోనిన్, మెలటోనిన్ లను ఉత్పత్తి చేసేందుకు తగిన సంఖ్యలో కేలరీలను పొందడం కష్టమవుతుంది.
న్యూట్రియెంట్స్ జర్నల్ ప్రకారం…పోషకాల లోపం వల్ల కావాల్సినంత నిద్ర ఉండదు. దీనివల్ల నిద్ర సంబంధిత రుగ్మతలు వచ్చే ఛాన్స్ ఉంది. విటమిన్ డీ లోపిస్తుంది.
నిద్రిలేమివల్ల ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుంది. మానసిక స్థితి, శక్తి అనేది జీవిక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్లీప్ ఫౌండేషన్ ప్రకారం..నిద్ర మనస్సు, శరీరాన్ని రీఛార్జ్ చేసేందుకు సహాయపడుతుంది.
న్యూరో సైకియాట్రిక్ డిసీజ్ అండ్ ట్రీట్ మెంట్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, తీవ్రమైన నిద్ర లేమి, శ్రద్దను ఒకే విధంగా ప్రభావిం చేస్తుంది.
0 Comments:
Post a Comment