Sitting Style: కూర్చొనే విధానంతో వ్యక్తిత్వం చెప్పేయొచ్చు
Sitting Style: ముక్కు ఆకారం, నిద్రించే భంగిమలే కాదు కూర్చొనే భంగిమను బట్టి కూడా వ్యక్తిత్వ లక్షణాలు పసిగట్టొచ్చట. నిపుణులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మనం కాళ్లను పెట్టుకునే విధానాన్ని బట్టి వ్యక్తిత్వం వెల్లడవుతుంది.
సహజంగా కూర్చున్నప్పుడు మన పాదాలు, కాళ్లను ఎలా ఉంచుతామో దాని ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు.
మోకాళ్లను నిటారుగా, మధ్యలోకి తీసుకొచ్చి కూర్చొంటున్నారా
ఇలాంటి వారు తమ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు. తమపై తాము సానుకూల దృక్పథంతో తెలివిగా, హేతుబద్ధంగా నడుచుకుంటారు. రోజువారీ జీవితంలో సమయానికి కట్టుబడి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలరు.
మోకాళ్లను వేరుగా చేసి కూర్చొంటున్నారా..
వీళ్లు తమ గురించి గొప్పగా ఆలోచిస్తారు. స్వార్థం ఉంటుంది. ఆందోళన కలిగించే వ్యక్తిగా, అయోమయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. తాము తెలివిగా మాట్లాడుతున్నామని భావించి సాధారణంగా మాటల పర్యవసానాలను పట్టించుకోరు.
కాలు మీద కాలేసుకుని కూర్చొంటే..
ఒక కాలిపై మరో కాలు వేసుకుని కూర్చొంటే.. సృజనాత్మకత ఉంటుందని, వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉంటూ కలలు కనేవాడని చెబుతున్నారు. కాలు మీద కాలేసుకుని కూర్చోవడం రక్షణాత్మక వైఖరిని వెల్లడిస్తుంది. పాదం ఎదురుగా ఉన్న వ్యక్తి దిశలో ఉంటే నమ్మకంగా మాట్లాడుతున్నారని అర్థం.
యాంకిల్డ్ క్రాస్డ్
ఈ పొజిషన్ లో కూర్చొంటే రాయల్టీ లాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటూ చుట్టూ ఉన్నవారిని ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేయగల సామర్థ్యం మీకుంది. మీ ప్రదర్శనపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ రహస్యాలను బయటకుపోనివ్వరు.
ఫిగర్ ఫోర్ లెగ్ లాక్
ఇలా కూర్చొండే వారు ఆశావాద, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కోరికలను నెరవేర్చుకునే పనిలో లక్ష్యాలను చేరుకునే వరకూ తెలివిగా వ్యవహరిస్తారు. డ్రెస్సింగ్ తో పాటు అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. మరొకరి అభిప్రాయంతో ఏకీభవించడానికి నిరాకరిస్తారు.
0 Comments:
Post a Comment