నిరుద్యోగులకు శుభవార్త: సింగరేణి(SCCL) సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల చేసింది.
మొత్తం 177 ఖాళీలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణలో ఉన్న పాత ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయి. మిగిలిన 5 శాతం ఇతర జిల్లా అభ్యర్థులకు దక్కనున్నాయి.
మొత్తం ఉద్యోగాలు: 177
పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్స్/ఐటీ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి. 6 నెలల సర్టిఫికెట్ లేదా డిప్లొమా లేదా కంప్యూటర్ అప్లికేషన్స్/ఐటీలో డిగ్రీ.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 జూన్ 2022
చివరి తేదీ: 10 జూలై 2022
వయస్సు: గరిష్టంగా 30 సంవత్సరాలు.
SC/ST ఇతర రిజర్వ్డ్ కేటగిరీలకు 5 సంవత్సరాల సడలింపు.
ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/scclnew/index.asp ను చూడగలరు.
0 Comments:
Post a Comment