Pulihora: పులిహార పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదూ.. భోజనాలు అనగానే పులిహార ఉండాల్సిందే.. ఇక ఇళ్లలో కూడా చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార కామన్ రెసిపీ..
మరి ఎప్పుడైనా టమోటో పులిహార టెస్ట్ చేశారా..!? ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు టమోటో పులిహార.. ఇలా టేస్టిగా తయారు చేసుకోండి..!
Tamoto Pulihora: Recipe Complete Details
టమోటో పులిహార తయారీ విధానం..!
కావలసిన పదార్థాలు: బియ్యం పావు కిలో, టమాటాలు పావు కిలో, చింతపండు గుజ్జు ఒక చెంచా, పచ్చిమిర్చి ఆరు, ఇంగువ చిటికెడు, నూనె 100 గ్రాములు, ఎండుమిర్చి నాలుగు, వేరుశెనగ పప్పు మూడు చెంచాలు, సెనగపప్పు రెండు చెంచాలు, మినపప్పు రెండు చెంచాలు, ఉప్పు తగినంత, కరివేపాకు నాలుగు రెబ్బలు, పసుపు చిటికెడు.
ముందుగా ఒక బాండీలో టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె వేసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు టమాటాలు, పచ్చి మిర్చీలు, చింతపండు గుజ్జు మిక్సిలో వేసి పేస్టులా చేసుకోవాలి. అన్నం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో అన్నం ఆర పెట్టుకోవాలి.. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేయాలి.
నూనె కాగాక అందులో వేరుశెనగ పప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి. చివరిగా కరివేపాకు వేసి అందులో టమోటో గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. పైన కొత్తిమీర వేసుకుంటే టమోటా పులిహార తినడానికి రెడీ..
0 Comments:
Post a Comment