పూర్వ జన్మ పుణ్యం వల్ల వచ్చేది ఈ మానవ జన్మ. దానికి చేయాల్సిన వాటిని పోడశ సంస్కారాలని అంటారు.
అవి జనన పూర్వ సంస్కారాలు, జనాంతర సంస్కారాలు. గర్భంలో ఉండగా పుట్టకముందే జరిపే సంస్కారాల్లో ఈ సీమంతం మూడోది.
దీనికి మరో పేరు సీమంతోన్నయనం. అంతకుముందు జరిగే రెండు సంస్కారాలు గర్భాదానం, పుంసవనం, సీమంతమనేది కేవలం మొదటిచూపులప్పుడు, గర్భం దాల్చిన ఐదుగానీ…ఆరుగానీ …ఎనిమిదో నెలగానీ…చేయాలని శాస్త్రం చెబుతున్నది.
మిగతా పదమూడు సంస్కారాలు జీవితంలోని వేర్వేరు దశల్లో చేస్తుంటారు.
సీమంతం తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ ఆయుష్షును కోరుతూ చేసేది. కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలనే ఆశయంతో ఈ వేడుకను చేస్తుంటారు.
గర్భిణీ శారీరకంగానూ…మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దీన్ని నిర్వహిస్తారు.
స్త్రీ సంస్కార రూపం సీమంతోన్నయనాఖ్యం కర్మచ తంత్రేణ కరిష్యే అనే సంకల్పతో సీమంతం చేస్తారు పెద్దలు. బలమైన సంతాన సంపదను ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తారు.
మేడిపండ్లు, వనస్పతి వంటి పదార్థాలతో హోమం చేసే సంప్రదాయము కూడా ఉంది.
గర్భదోషాలను తొలగించే గర్భపోషణను అనుగ్రహించాలని హవ్యంతో ఉన్న పాత్రను చూపుతూ భర్తతోపాటు..గర్భిణీకి కూడా దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది.
0 Comments:
Post a Comment